Kangana Ranaut: 'ఎమర్జెన్సీ'.. తెలంగాణాలో విడుదలకు సమస్య
ABN , Publish Date - Aug 30 , 2024 | 10:43 AM
కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలపై నిషేధం విధించే ప్రయత్నం జరుగుతోంది.
కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలపై నిషేధం విధించే ప్రయత్నం జరుగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో షబ్బీర్‌ను కలిసి ‘ఎమర్జెన్సీ’ ( Emergency Movie) స్క్రీనింగ్ పై నిషేధం విధించాలని అభ్యర్థించింది. సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సినిమా చిత్రీకరణ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ 18 మంది సభ్యుల ప్రతినిధి బృందం రిప్రజెంటేషన్‌ను సమర్పించినట్లు షబ్బీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది ఆక్షేపణీయమైనది సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరణ ఉందని వారు ఆరోపించారు. ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరు సిక్కు సంఘం నాయకులకు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. తదుపరి తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని షబ్బీర్ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షబ్బీర్ అలీ.. సినిమా విడుదలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది! (Sikh Group Allegations)
కంగనా రనౌత్ కీలక పాత్రలో స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది( Emergency Movie Banned in Telangana). ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుం