Nargis Fakhri Sister: నటి సోదరి ఇద్దరిని చంపింది.. జైల్లో కూర్చుంది

ABN , Publish Date - Dec 03 , 2024 | 10:42 AM

బాలీవుడ్‌ నటి నర్గీస్‌ ఫక్రీ సోదరి అలియాను న్యూయార్క్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల మాజీ బాయ్‌ఫ్రెండ్‌, అతడి స్నేహితురాలిని అలియా సజీవ దహనం చేసినట్లు ఆరోపణలున్నాయి.

బాలీవుడ్‌ నటి నర్గీస్‌ ఫక్రీ (Nargis Fakhri) సోదరి అలియాను (Alia Fakhri) న్యూయార్క్‌ పోలీసులు అరెస్టు (Arrested in Newyork) చేశారు. గత నెల మాజీ బాయ్‌ఫ్రెండ్‌, అతడి స్నేహితురాలిని అలియా సజీవ దహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యూయార్క్‌లో ఉంటున్న అలియా ఫక్రీ కొంతకాలం పాటు ఎడ్వర్డ్‌ జాకోబ్‌ (Jacobs) అనే యువకుడితో డేటింగ్‌లో ఉంది. పలు కారణాలతో ఏడాది క్రితం విడిపోయారు. అనంతరం జాకోబ్‌కు అనాస్టాసియా (Anastasia Ettienne) ఎటినీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుసుకున్న అలియా పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై బెదిరించసాగింది. (Jacobs and Anastasia Ettienne)

నవంబరు 2న జాకోబ్‌ ఆయన స్నేహితులు ఉంటున్న భవనం వద్దకు వెళ్లి ఆ ఇంటికి నిప్పంటించింది. దీన్ని గమనించిన స్థ్థానికులు వారిని అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే మంటల్లో చిక్కుకుని వారిద్దరూ ప్రాణాలు విడిచారు. ప్రత్యక్ష సాక్షుల రిపోర్ట్‌తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా అలియా ఫక్రీని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆమెను రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణను డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు. సోదరి అరెస్టుపై నర్గీస్‌ ఫక్రీ నుంచి ఎలాంటి స్పందన లేదు 

Updated Date - Dec 03 , 2024 | 11:18 AM