Manasi Parekh: ఆ పోరాటాలే మనమేంటో చెబుతాయి..

ABN , Publish Date - Oct 19 , 2024 | 05:37 PM

గుజరాతీ చిత్రం ‘కచ్‌ ఎక్స్‌ప్రెస్‌’లో (Kutch Express) నటనకుగానూ 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో (National Award) ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు మానసి పరేఖ్‌


గుజరాతీ చిత్రం ‘కచ్‌ ఎక్స్‌ప్రెస్‌’లో (Kutch Express) నటనకుగానూ 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో (National Award) ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు మానసి పరేఖ్‌ (Manasi Parekh). ఆమె నటించిన ఐదో చిత్రమిది. ఇటీవల జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఐదో చిత్రానికే నేషనల్‌ అవార్డు రావడంతో ఆమె పేరు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ర్టీగా మారింది. తాజాగా మానసి ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌  రోజులను గుర్తుచేసుకున్నారు.

‘‘రోజూ ఉదయం 8 గంటలకు మూడు జతల బట్టలు తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేదాన్ని. ఆడిషన్స్‌  జరిగే చోటు ఎంత దూరమైనా వెళ్లేదాన్ని. ఒక్కోసారి ఒక పాత్రకు 150 మంది లైన్‌లో ఉండేవారు. ఎంత కష్టమైనా ఆడిషన్స్‌ ఇచ్చే ఇంటికి వేళ్లేదాన్ని. పోరాటాలు, కష్టాలు, ఎదుర్కొవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మనం చేేస పోరాటాలే మనమేంటో తెలియజేస్తాయి. నేను అన్ని పోరాటాలు చేసి కష్టపడ్డాను  కాబట్టే.. ఈ స్థాయికి చేరుకోగలిగానని నమ్ముతాను. కష్టాల తర్వాత వచ్చే విజయం లో ఉండే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అదొక మధురానుభూతి. అప్పుడే ప్రతి క్షణాన్ని ఆస్వాదించ గలుగుతాం. మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం’’ అని అన్నారు.

Manasi-parekh.jpg
 
బాలీవుడ్‌ గురించి మాట్లాడుతూ "ఉరి: ది సర్జికల్‌ స్ట్రయిక్‌’ సినిమాలో విక్కీ కౌశల్‌కు సోదరిగా నటించిన తర్వాత అందరూ తనను సిస్టర్‌ క్యారెక్టర్స్‌ కోసమే సంప్రదించారని మానసి అన్నారు. అందుకే బాలీవుడ్‌పై ఆసక్తి కోల్పోయినట్లు చెప్పారు. ‘‘ఉరి’ తర్వాత నేను కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాను. అయినా.. బాలీవుడ్‌లో మాత్రం నాకు సోదరి పాత్రలే వచ్చాయి. నేను ఆ పాత్రకు మించి చేయగలనని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందుకే బాలీవుడ్‌పై ఆసక్తి పోయింది. ఇప్పుడు నేను నిర్మాతను కాబట్టి గొప్ప పాత్రలను సృష్టించుకోగలను’’ అని అన్నారు.
 

Updated Date - Oct 19 , 2024 | 05:37 PM