Prasanth Varma: బాలీవుడ్‌ హీరోతో ప్రశాంత్  వర్మ సినిమా

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:19 AM

'హనుమాన్'.. ఈ ఏడాది విపరీతంగా  మార్మోగిన టైటిల్‌. సంక్రాంతి బరిలో విడుదలై సంచలన విజయం సాధించింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Prasanth Varma: బాలీవుడ్‌ హీరోతో ప్రశాంత్  వర్మ సినిమా
Prasanth Varma - Ranveer singh

'హనుమాన్'(Hanuman).. ఈ ఏడాది విపరీతంగా  మార్మోగిన టైటిల్‌. సంక్రాంతి బరిలో విడుదలై సంచలన విజయం సాధించింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పాన్  ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించింది. దాంతో ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా పాపులర్‌ అయింది. ఇప్పుడాయన ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' తీసే సన్నాహాల్లో ఉన్నారు. అయితే తాజాగా ఓ వేదికపై హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ప్రకటించారు. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్‌’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. 

Ranvee.jpg

రానున్న ఇరవయ్యేళ్లూ ఈ ప్రపంచం చుట్టూ సినిమాల్ని తెరకెక్కించాలనేది ఆయన ప్లాన్. ఇందులో భాగంగానే త్వరలోనే ఆయన బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో జట్టు కట్టనున్నారు. ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) హీరోగా సినిమా దాదాపు ఖాయమైనట్టే. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ కలయికలో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. దీని తర్వాత ‘హను-మాన్‌’కి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం.

Sai Durga Tej: ఈసారి విభిన్న కథాంశంతో..

Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 29 , 2024 | 10:24 AM