Rakul Preet Singh: గోవాలో మూడు రోజుల పెళ్లి!
ABN , Publish Date - Feb 12 , 2024 | 06:00 PM
గత వారంరోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించిన వార్త విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే! తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఈ నెలలోనే గోవాలో పెళ్లంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఆ వార్త నిజమేనని స్పష్టమవుతోంది.
గత వారంరోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ (Rakul) పెళ్లికి సంబంధించిన వార్త విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే! తన ప్రియుడు జాకీ భగ్నానీతో(Jackky Bhagnani) ఈ నెలలోనే గోవాలో పెళ్లంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఆ వార్త నిజమేనని స్పష్టమవుతోంది. రకుల్ త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కబోతున్నారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని ఆమె వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో రకుల్-జాకీల వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు రోజుల పాటు వీరి పెళ్లి జరగనుందని సమాచారం. రోజుకొక డిజైనర్ డిజైన చేసిన దుస్తుల్ని ఈ జంట ధరించనున్నారు. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులను డిజైన్ చేశారు. మొదటి రకుల్ పెళ్లి మిడిల్ ఈస్ట్‌లో ప్లాన్ చేశారు. కొన్ని కారణాల చేత గోవాకు షిప్ట్ చేశారు. బీటౌన్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో రిలేషన్ లో ఉన్నానంటూ 2021లోనే రకుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.