Rakul preeth singh: అబ్బాయిలకు ఆ మాట చెప్పగలమా?

ABN , Publish Date - Mar 21 , 2024 | 07:18 PM

తన ప్రియుడు జాక్నీ భగ్నానీతో పెళ్లి అనంతరం మొదటిసారి ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul preeth singh). ముంబయి వేదికగా జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2024లో ఆమె షో టాపర్‌గా ర్యాంప్‌పై హొయలొలికించారు.

Rakul preeth singh:  అబ్బాయిలకు ఆ మాట చెప్పగలమా?

 
తన ప్రియుడు జాక్నీ భగ్నానీతో పెళ్లి అనంతరం మొదటిసారి ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul preeth singh). ముంబయి వేదికగా జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2024లో ఆమె షో టాపర్‌గా ర్యాంప్‌పై హొయలొలికించారు. ఈ నెల 13 నుంచి 17 వరకూ జరిగిన ఈ ఫ్యాషన్  షోలో బాలీవుడ్‌కు చెందిన జాన్వీకపూర్‌, అనన్య పాండే, త్రిప్తి డిమ్రి, తాప్సీ, సారా అలీఖాన్‌, శ్రుతిహాసన్‌ ఇలా చాలామంది తారలు వేదికపై సందడి చేశారు. రితికా డిజైన్‌ చేసిన బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌తో రకుల్‌ ర్యాంప్‌పై నడిచారు. 

అనంతర రకుల్‌ మీడియాతో మాట్లాడుతూ ''రితికా మిర్చందానీ కలెక్షన్స్‌ ధరించి షోలో పాల్గొనడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మీరు కొత్తగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు కదా. డ్రెస్సింగ్‌ స్టైల్‌లో మార్పులు చేసుకోమని ఇంట్లో వాళ్లు ఏమైనా సూచించారా?’’ అని ప్రశ్నించగా, ‘‘అలాంటిది ఏమీ లేదు. నా కుటుంబ సభ్యులు, జాకీ ఫ్యామిలీ విషయంలో ఎంతో సంతోషం, గర్వంగా ఉన్నా. మన సమాజంలో పెళ్లిని చాలా పెద్ద విషయంగా చూస్తుంటాం. కానీ, ఎవరి జీవితంలోనైనా అది సహజమైన ప్రక్రియ. పెళ్లయ్యాక ఓ అబ్బాయికి ఇలాంటి దుస్తులే ధరించమని చెప్పగలమా? కాలం మారింది. ఎవరికి నచ్చిన విధంగా వారు జీవిస్తున్నారు’’ అని రకుల్‌ అన్నారు.

Updated Date - Mar 21 , 2024 | 07:27 PM