Ratan Tata: బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో రతన్ ప్రేమ.. మీకు తెలుసా?
ABN , Publish Date - Oct 11 , 2024 | 07:54 AM
"ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది, చాలా కష్టం. ఫేర్వెల్ మై ఫ్రెండ్" అంటూ అలనాటి బాలీవుడ్ తార ట్వీట్ చేశారు. టాటా జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగానే ఉన్నారు. అయితే బాలీవుడ్ లోని ఒక ప్రముఖ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..
టాటా.. రతన్ టాటా (Ratan Tata) ఈ పేరంటే తెలియని భారతీయుడంటూ ఉండరు. అంతగా మన ప్రజలతో పెనవోసుకుబోయిన బంధం ఆయనది. అలాంటి వ్యక్తి గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడవడంతో దేశవ్యాప్తంగా ప్రజలు కన్నింటి పర్యంతం అయ్యారు. ఆయన దేశానికి, ప్రజలకు అందించిన సేవలను కొనియాడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలామంది తమ సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపం తెలియజేస్తూ నివాళుర్పించారు. టాటా జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగానే ఉన్నారు. అయితే బాలీవుడ్ లోని ఒక ప్రముఖ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..
రతన్ టాటా తన లైఫ్‌లో ప్రేమ, పెళ్లి చోటు గురించి పలుమార్లు మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆయన నాలుగు సార్లు ప్రేమలో పడ్డారట. ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోలేకపోయానని చెప్పారు. ఫారెన్‌లో చదువుకొనే రోజుల్లో ప్రేమ గురించి ఎక్కువగా ఆలోచించే వాడిని అని చెప్పుకొచ్చారు. కానీ.. తన లవ్ స్టోరీస్ సక్సెస్ కనపడకపోవడంతో పెళ్లిపై ఆశలు వదులుకున్న అన్నారు. అయితే ఆయన తుది శ్వాస విడిచినప్పుడు తన మాజీ ప్రేయాసి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సిమి గరేవాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్టయన్... ది హంటర్’ ఎలా ఉందంటే..
"ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది, చాలా కష్టం. ఫేర్వెల్ మై ఫ్రెండ్" అంటూ అలనాటి బాలీవుడ్ తార సిమి గరేవాల్ చేసిన ట్వీట్ అందరిని బాధపెట్టింది. సిమి గరేవాల్ ప్రముఖ నిర్మాత యశ్ రాజ్ చోప్రా భార్య పామెలా చోప్రా కజిన్ సిస్టర్. ఆమె టాక్ షో "రెండెజౌస్ విత్ సిమి గరేవాల్"కి ప్రసిద్ధి చెందింది. ఆమె రతన్ టాటాతో సన్నిహిత స్నేహాన్ని కలిగి ఉండేది. 1997లో ఆమె టాటాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో సిమి అండ్ టాటా బంధం ఏంత లోతైనదో యావత్ ప్రపంచానికి తెలిసింది. దో బదన్, మేరా నామ్ జోకర్, అరణ్యేర్ దిన్ రాత్రి లాంటి కల్ట్ బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. 70 ఏళ్లలోనూ ఆమె ఇప్పటికీ షోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. దాదాపు రతన్‌తో ఆమె ప్రేమ సంబంధం పెళ్లిగా మారేదట. కానీ.. కొన్ని పర్సనల్ రీజన్స్‌తో పరస్పర అంగీకారంతో వారు తమ రిలేషన్‌షిప్‌కి స్వస్తి పలికారు.