Salman Khan: సిద్ధిఖీ హత్య.. సల్మాన్ అలర్ట్

ABN , Publish Date - Oct 14 , 2024 | 05:07 PM

దీనికి ఆయన రెస్పాండ్ కాకపోవడంతో మర్డర్‌కి స్కెచ్ వేసినట్లు టాక్. దీంతో సల్మాన్ మరోసారి అలర్ట్ అయ్యారు. గతంలోనూ బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబీ సింగర్ సిద్దూ‌మూస్ వాలా హత్యా చేసింది.

Salman, Babu siddique and Sharukh

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడంతో ముంబై అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే బాబా సిద్ధిఖీ స్నేహితుడు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి సల్మాన్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్‌కి గతంలోనూ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే..


ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాలు కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సినీ ఇండస్ట్రీతో బాబా సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ కు ఆప్త మిత్రుడైన సిద్ధిఖీ ప్రతియేటా రంజాన్ పర్వదినాన గ్రాండ్ ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తారు. ఈ వేదికపై సల్మాన్, షారుఖ్ ఖాన్ లను కలిపిన ఘనత ఆయనకే చెందుతుంది. అలాంటిది ఆయన మరణ వార్త వినగానే సల్మాన్ బిగ్‌బాస్ షో షూటింగ్ మధ్య నుండే సిద్దిఖీ పార్థివదేహం వద్దకు చేరుకున్నారు.


ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సల్మాన్‌కి ఒక అలర్ట్ పంపినట్లు సమాచారం. సిద్ధిఖీని హత్యా చేసిన బిష్ణోయ్ వర్గంతో గతంలో సల్మాన్‌కి వివాదం ఉంది. 1998లో 'హమ్ సాత్ సాత్ హై' సినిమా రాజస్థాన్ షూటింగ్ తర్వాత సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం కొఠారిలు కలిసి కృష్ణజింకను వేటాడారు. దీంతో బిష్ణోయ్ తెగ ఎంతో పవిత్రంగా భావించే కృష్ణజింకను వేటాడటంతోసల్మాన్ ఖాన్‌కి హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం దిగువ కోర్ట్ సల్మాన్ ఖాన్‌ని దోషిగా ప్రకటించిన హై కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బిష్ణోయ్ గ్యాంగ్ మరింత రెచ్చిపోయింది. సల్మాన్ మాజీ ప్రేయాసి, లాయర్ సోమీ అలీ బహిరంగ క్షమాపణలు తెలిపిన బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ క్షమాపనులు చెప్పాలని డిమాండ్ చేసింది. దీనికి ఆయన రెస్పాండ్ కాకపోవడంతో మర్డర్‌కి స్కెచ్ వేసినట్లు టాక్. దీంతో సల్మాన్ మరోసారి అలర్ట్ అయ్యారు. గతంలోనూ బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబీ సింగర్ సిద్దూ‌మూస్ వాలా హత్యా చేసింది.

Updated Date - Oct 14 , 2024 | 05:07 PM