Sara Ali Khan: ఓవైపు దేశభక్తి.. మరో వైపు అంతకుమించి రక్తి! ఇది ఆమెకే సాధ్యం
ABN , Publish Date - Mar 12 , 2024 | 04:53 PM
ఓ వైపు దేశభక్తి మరోవైపు రక్తితో కూడిన రెండు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీఖాన్. తాజాగా అమె నటించిన చిత్రాలు మర్డర్ ముబారక్, అయే వతన్ మేరే వతన్ చిత్రాలు వారం రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
ఓవైపు దేశభక్తి మరోవైపు రక్తితో కూడిన రెండు విభిన్న పాత్రలతో వారం రోజుల లోపే రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీఖాన్. సైఫ్ అలీఖాన్ గారాల పట్టిగా 2018లో హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందాల సుందరి అచీతూచి తన కేరీర్‌ను డెవలప్ చేసుకుంటుంది.
అందానికి అందం, నటన, గ్లామర్ విషయంలో మోహమాటం ఏ మాత్రం లేని ఈ చిన్నది రొజురోజుకు పరిశ్రమలో తన పేరును సుస్థిరం చేసుకుంటోంది. తన ఈడు వయస్సున్న జాన్వీ కపూర్, అనన్యాపాండే గట్టి పోటీ ఇస్తున్నా వాళ్లను అధిగమించి సారా తనదై నశైలిలో సినిమాలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో హయ్యెస్ట్ పెయిడ్ అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంటోంది.
గత సంవత్సరం విక్కీ కౌశల్‌తో చేసిన జర హట్కే.. జర బచ్కే (Zara Hatke Zara Bachke) చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించగా ఈ సంవత్సరం ప్రధమార్ధంలోనే ఒకటే నెలలో వారం వ్యవధిలో రెండు చిత్రాలతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో ఒకటి మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న మర్డర్ ముబారక్ (Murder Mubarak) కాగా రెండోది దేశభక్తి ప్రధానంగా రూపొందుతున్న అయే వతన్ మేరే వతన్ (Aye Watan Mere Watan). ఈ రెండు కూడా కేవలం 7 రోజుల వ్యవధిలో విడుదల అవుతుండగా ఆ రెండు డైరెక్ట్ ఓటీటీలోనే స్ట్రీమింగ్‌కు రానుండడం విశేషం.
అయితే మర్డర్ ముబారక్ (Murder Mubarak) రోమాన్స్ చిత్రం కాగా ఇందులో సారా అలీఖాన్ గ్లామర్ డోస్ ఓ రేంజ్‌లో ఉండనుంది. ఎన్నడు లేని విధంగా బోల్డ్, ముద్దు సన్నివేశాలలో అమ్మడు బాగానే రెచ్చి పోయి నటించినట్లు ఆ చిత్ర ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి చాలామంది పేరున్న నటులు కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ (VijayVarma), డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా వంటి వారు నటిస్తుండగా వారిని తలదన్నేలా సారా అలీఖాన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండనుంది. ఈ సినిమా మార్చి 15 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవనుంది.
ఇక అమ్మడు నటించిన మరో చిత్రం అయే వతన్ మేరే వతన్ (Aye Watan Mere Watan). 1945లో ఫ్రీడం ఫైట్ నేపథ్యంలో నిజంగా జరిగిన సంఘటనల అధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పూర్తిగా సారా అలీఖాన్ అధారంగా నడుస్తుంది. అప్పటి వస్త్రధారణలోనే ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఈ సినిమా రూపొందింది.
ఈ మూవీ కూడా థియేటర్లలో విడుదలవకుండా మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo) ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. అయితే ఇంత చిన్న గ్యాపులోనే ఇంత వైవిధ్యమున్న పాత్రల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటున్న సారా అలీఖాన్ కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.