Shahid kapoor: మారుతున్న కాలాన్ని బట్టి మన ఆలోచన తీరు ఉండాలి!

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:37 PM

‘ఒక సినిమా చూస్తున్నప్పుడు అందులో ఏదో ఒక మ్యాజిక్‌ కనిపించాలి. వినే పాటలో లీనమై పోవాలి. విజువల్స్‌ చూస్తున్నప్పుడు చప్పట్లు, ఈలలు వేయాలనే అనుభూతి కలగాలి. కానీ ప్రేక్షకులు ఎప్పటికీ వాటినే గుర్తుపెట్టుకోవాలని లేదు. రోజులు మారుతున్న కొద్ది అభిరుచులు మారిపోతుంటాయి. వాటన్నింటినీ మేళవించి ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాం’’ అని బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ అన్నారు.

Shahid kapoor: మారుతున్న కాలాన్ని బట్టి మన ఆలోచన తీరు ఉండాలి!

‘‘ఒక సినిమా చూస్తున్నప్పుడు అందులో ఏదో ఒక మ్యాజిక్‌ కనిపించాలి. వినే పాటలో లీనమై పోవాలి. విజువల్స్‌ చూస్తున్నప్పుడు చప్పట్లు, ఈలలు వేయాలనే అనుభూతి కలగాలి. కానీ ప్రేక్షకులు ఎప్పటికీ వాటినే గుర్తుపెట్టుకోవాలని లేదు. రోజులు మారుతున్న కొద్ది అభిరుచులు మారిపోతుంటాయి. వాటన్నింటినీ మేళవించి ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాం’’ అని బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ (Shahid kapoor) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’. కృతి సనన్ కథానాయిక. అమిత్‌ జోషి, ఆరాధనా సాహ్‌ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానున్న సందర్బ్భంగా ఓ ఇంటర్వ్యూలో  షాహిద్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

shahid.jpg

షిఫ్రా అనే రోబో ప్రేమలో పడిపోతాడు ఓ వ్యక్తి. చివరికి రోబో అని తెలిసినా తన ప్రేమను వదులుకోలేకపోతాడు. మరి ఆ అసాధ్యమైన  ప్రేమ చివరిదాకా నిలిచిందా లేదా అన్నది కథ. స్టోరీ లైన్ మొదటిసారి విన్నప్పుడు  కొత్తగా అనిపించింది. ఇప్పుడున్న టెక్నాలజీ కి తగ్గ చిత్రమిది అని అనుకున్నాను. కొత్తదనంతో నిండిన ఒక అందమైన, అసాధ్యమైన ప్రేమకథ ఇది. ఒక మనిషికి రోబో పట్ల కలిగే ప్రేమను ఎంతో అందంగా చూపించారు దర్శకులు. ‘ఈ సినిమాతో అందరినీ మెప్పించగలమనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం లేకపోతే సినిమా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ సరికొత్త ప్రేమకథతో ఆ నమ్మకం కలిగింది. మేము దానిని భిన్నంగా చూపించాము. ఇది ప్రేమకథతో పాటు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కూడా. 

Krithi.jpg

‘‘ప్రేక్షకులు కథ నచ్చితే ఏ జానర్‌ చిత్రమైనా చూస్తారు. జానర్‌ ఏదైనా నటీనటులు మంచి కథలను ఎంచుకోవాలి. అభిమానులు ఇలాంటి కథ కదా  చూపించాలి అనుకోవాలి. ప్రేక్షకుల దృష్టితో ఆలోచించి వారికి ఎలాంటి కథ ఐతే నచ్చుతుందో చూడాలి. అయితే ఈ చిత్రం బృందం అంతా ఇదే కోణంలో ఆలోచించిందని అభిప్రాయం. 


Updated Date - Feb 09 , 2024 | 03:38 PM