Sonakshi sinha Marriage: మా అమ్మాయి ఆనందం ముఖ్యం.. శత్రఘ్నసిన్హా స్పందన!
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:59 PM
బాలీవుడ్ నటి, శత్రఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)నటుడు జహీర్ ఇక్బాల్‌ను(Zaheer Iqbal) పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే!
బాలీవుడ్ నటి, శత్రఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)నటుడు జహీర్ ఇక్బాల్‌ను(Zaheer Iqbal) పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈ రూమర్స్‌పై ఆమె ఇప్పటి దాకా స్పందించలేదు. కానీ పెళ్లి పనులైతే జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సోనాక్షి- ఇక్బాల్‌ల వివాహం ఆదివారం జరగనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని సోనాక్షి ఇంట నిర్వహించిన మెహందీ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు హాజరైనట్లు తెలుస్తోంది.
తన కుమార్తె వివాహానికి వెళ్లరంటూ వచ్చిన వార్తలపై ఇటీవల నటుడు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha Reaction) స్పందించారు. గతంలో ఓ సందర్భంలో శత్రఘ్న సిన్హా ఏమన్నారంటే.. నా కూతురు గురించి, ఆమె నిర్ణయాల గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేదు. పెళ్లి గురించి ఆమె నాకు ఎప్పుడూ చెప్పలేదు. మీడియా వల్లే నాకు తెలిసిందే. ఆమె మమ్మల్ని ఆహ్వానిస్తే, నేను, నా భార్య వెళ్లి ఆశీర్వదిస్తాం. తను ఇప్పుడే కెరీర్‌లో సెటిల్ అవుతోంది. ఆమె ఆనందం కూడా మాకు ముఖ్యమే అన్నారు’’ అని చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘‘ఇది నా ఒక్కగానొక్క కుమార్తె జీవితం. ఆమె అంటే నాకు అమితమైన ప్రేమ. నేనే తన బలం అని ఆమె ఎన్నోసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తా. 23న సాయంత్రం జరిగే రిసెప్షన్ లో పాల్గొంటున్నాం. మా అమ్మాయి పెళ్లి గురించి మా కుటుంబం ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. కొన్ని మీడియా సంస్థలు ఊహాగానాలు రాశాయి. ఇది వ్యక్తిగతమైన విషయం. పెళ్లి అనేది అందరి ఇళ్లలోనూ జరుగుతుంది. పెళ్లికి ముందు కొన్ని విషయాలు జరగడం సహజం. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఉంటుంది. ఆమె శత్రుఘ్న సిన్హా కుమార్తె అయినంత మాత్రాన సోనాక్షికి జీవితంలో తను కోరుకున్నది దక్కదని కాదు. జూన్ 23న మాకు మంచి రోజు కానుంది’ అని అన్నారు.