Aishwarya Rai: నేను 'ఐశ్వర్య రాయ్' కొడుకుని.. వైరల్

ABN , Publish Date - Nov 04 , 2024 | 08:34 AM

ఒక వైపు భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతుండగా మరోవైపు ఐశ్వర్య ఫ్యామిలీ ఫంక్షన్‌లో అభిషేక్ కనిపించలేదంటూ ఎదో ఒక వార్త ఐశ్వర్యని వార్తల్లో నిలిచేలా చేస్తోంది. ఇక ఐశ్వర్య కూతరు ఆరాధ్య, మామ అమితాబ్ బచ్చన్‌కి సంబంధించిన ఎదో ఒక వార్తలో ఈ విశ్వసుందరి ప్రస్తావన వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాను ఐశ్వర్య కొడుకును అంటూ వైజాగ్‌కి చెందిన ఓ వ్యక్తి వీడియో చేయడంతో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఇంతకీ ఏమైందంటే..

బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ ఈ మధ్య కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక వైపు భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతుండగా మరోవైపు ఐశ్వర్య ఫ్యామిలీ ఫంక్షన్‌లో అభిషేక్ కనిపించలేదంటూ ఎదో ఒక వార్త ఐశ్వర్యని వార్తల్లో నిలిచేలా చేస్తోంది. ఇక ఐశ్వర్య కూతరు ఆరాధ్య, మామ అమితాబ్ బచ్చన్‌కి సంబంధించిన ఎదో ఒక వార్తలో ఈ విశ్వసుందరి ప్రస్తావన వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాను ఐశ్వర్య కొడుకును అంటూ వైజాగ్‌కి చెందిన ఓ వ్యక్తి వీడియో చేయడంతో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఇంతకీ ఏమైందంటే..


ఒకవైపు ఐశ్వర్య-అభిషేక్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు అభిమానుల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటే.. ఓ వైరల్ వీడియో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. వైజాగ్‌కి చెందిన సంగీత్ కుమార్ తాను ఐశ్వర్య కుమారుడినని, ఆమె పెళ్లి కాకముందే నేను “IVF-ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌’’ ద్వారా జన్మించానని చెబుతున్నాడు. తాను లండన్‌లో పుట్టానని, మొదట ఐశ్వర్య పేరెంట్స్ నన్ను పెంచారు, తర్వాత తనని వైజాగ్‌లో వేరే వాళ్లకు అప్పగించినట్లు చెప్పుకున్నాడు. ఇక తాను ఐశ్వర్యకు పుట్టినట్లు సాక్ష్యాలు లేకుండా ఆధారాలను ధ్వంసం చేశారని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని విచారరించగా మతిస్థిమితం లేని వాడిగా తెలిసింది. అయితే ఈ వీడియో గతంలోదైనా ఐశ్వర్య-అభిషేక్ విడాకుల వార్తల నేపథ్యంలో మరోసారి వైరల్ అయ్యింది.


ఇటీవల ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒక ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు. కానీ.. అభిషేక్ మిస్ అయ్యాడు. దీంతో నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఐశ్వర్య రాయ్ తన కజిన్ బర్త్ డేకి కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్ళింది. అక్కడ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో వైరల్ అయ్యింది. అభిషేక్ ఈ ఈవెంట్ కి ఎందుకు హాజరు కాలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే హౌస్ ఫుల్ 5 సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని అభిషేక్ లండన్ నుండి తిరిగి వచ్చిన ఇంకా రెస్ట్ మోడ్‌లోనే ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ప్రతిదీ విడాకులకు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదంటూ మరికొందరు మండిపడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య తన భర్తకి బర్త్ డే విషెస్ లేట్‌గా చెప్పడంతో విడాకుల రూమర్స్ పుట్టాయి. అయితే ఆరాధ్య స్కూల్ ఈవెంట్, అమితాబ్ బర్త్ డే సందర్భంగా ఐశ్వర్య ఈ వార్తలను పరోక్షంగా కొట్టిపడేసిన.. ఈ వార్తలకు ఇంకా చెక్ పడినట్లు కనిపించడం లేదు.

Updated Date - Nov 04 , 2024 | 12:16 PM