Shreya Ghoshal: పాటతోనే కాదు.. అందంతోనూ మతులు పొగొడుతున్న శ్రేయా గోషాల్
ABN , Publish Date - Jul 17 , 2024 | 05:29 PM
శ్రేయా గోషాల్ ఈపేరు తెలియని వారంటూ మన దేశంలో ఎవరూ ఉండరు. అయితే శ్రేయా ఈసారి పాటతో కాకుండా తన డ్రెస్సింగ్‌తో వార్తల్లో నిలిచింది.
శ్రేయా గోషాల్ (Shreya Ghoshal) .. ఈపేరు తెలియని ఆ గ్రాతం వినని వారంటూ ప్రస్తుతం మన దేశంలో ఎవరూ ఉండరు. చిన్న వయస్సులోనే గాయనిగా ఆరంగేట్రం చేసి అతి తక్కువ సమయంలో దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
ఎలాంటి కఠినమైన పాటకైనా తన గాత్రంతో ప్రాణం పోస్తూ మెలోడీ క్వీన్‌గా అభిమానులతో నిరాజనాలు అందుకుంటోంది. తనకు మరెవరు సాటిలేదని నిరూపించుకుంటోంది.
అయితే శ్రేయా గోషాల్ ఈసారి పాటతో కాకుండా తన డ్రెస్సింగ్‌తో వార్తల్లో నిలిచింది. తాజాగా ముంబైలో అంబాని (Ambani Wedding) ఇంట అంబరాన్నంటేలా జరిగిన వివాహ వేడుకలో గాయని శ్రేయా గోషాల్ ఇతర సింగర్స్‌తో కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంది.
ఈ సందర్భంగా అక్కడ ఈవెంట్లో పాల్గొన్నన్ని రోజులు ప్రత్యేకంగా డిజైన్ దుస్తులు ధరించి అహుతులను తనవైపు తిప్పుకునేలా చేసింది. అందరిలోనూ ప్రత్యేక అకర్షణగా నిలిచింది.
వివాహా సంబురాల్లో భాగంగా మూడో రోజు జరిగిన అశీర్వాద్ వేడుకలో బంగారు వర్ణం జరి అంచు డ్రెస్ ధరించి మెస్మరైజ్ చేసింది.
తాజాగా ఆ ఫొటోలను శ్రేయ సోషల్ మీడియాలో షేర్ చేయగా బాగా వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
తాజాగా శ్రేయ పుష్ఫ 2 ది రూల్ (Pushpa 2: The Rule) సినిమాలో సూసేకి అనే పాటతో పలకరించింది. అంతేకాదు ఇదే పాటను ఆరు భాషల్లోనూ పాడడం విశేషం.