Sai Pallavi: రణ్‌బీర్‌ రాముడా?.. సీతమ్మ లక్షణాలు ఉన్నాయా?

ABN , Publish Date - Jun 21 , 2024 | 08:46 PM

లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి (Sai pallavi) కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంటారు. తనకు యాప్ట్‌ అనుకున్న కథల్నే ఆమె అంగీకరిస్తుంటారు. తెలుగునాట సహజత్వానికి కేరాఫ్‌గా గురింపు తెచ్చుకుని ప్రేక్షకులతో శబాష్‌ అనిపించుకుంది.

Sai Pallavi:  రణ్‌బీర్‌ రాముడా?.. సీతమ్మ లక్షణాలు ఉన్నాయా?


లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి (Sai pallavi) కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంటారు. తనకు యాప్ట్‌ అనుకున్న కథల్నే ఆమె అంగీకరిస్తుంటారు. తెలుగునాట సహజత్వానికి కేరాఫ్‌గా గురింపు తెచ్చుకుని ప్రేక్షకులతో శబాష్‌ అనిపించుకుంది. ఎలాంటి పాత్ర ఇచ్చిన మెప్పించగల ఆమె స్కిన్‌ షోకు దూరంగా ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ రాణిస్తుంది. తమిళంలోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. కొంత బ్రేక్‌ తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అయింది. తెలుగులో నాగచైతన్యతో 'తండేల్‌' (Thandel)అనే సినిమా చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో పాటు హిందీలో 'రామాయణ్‌' (Ramayan) చిత్రంలో నటిస్తోంది  రణబీర్‌ కపూర్‌ (Ranbir kapoor)రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. తాజాగా బాలీవుడ్‌ నటుడు సాయిపల్లవిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. బుల్లి తెరపైన లక్ష్మణుడిగా పాపులర్‌ అయిన సునీల్‌ లాహ్రి సాయిపల్లవిపై చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ai.jpg
సునీల్‌ లాహ్రి.. టీవీ సిరీస్‌ రామాయణంలో లక్షణుడిగా నటించారు. ఆయన మాట్లాడుతూ "యానిమల్‌ సినిమా చూసిన తర్వాత రణబీర్‌ను రాముడిగా ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఇక సీత పాత్రధారి సాయి పల్లవిలో సీత పోలికలు ఏమాత్రం కనిపించట్లేదు. నటిగా ఆమె ఎలా ఉంటుందో తెలియదు ఆమె  సినిమాలు నేను ఎప్పుడూ చూడలేదు. లుక్స్‌ పరంగా ఆమెలో దేవత లక్షణాలు లేవు’’ అని అన్నారు. ఈ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సునీల్‌ లాహ్రి కామెంట్స్‌కు సాయి పల్లవి అభిమానులు మండిపడుతున్నారు. సాయి పల్లవి లాంటి నటి గురించి ఇలా కామెంట్స్‌ చేయడం సరికాదు అని అంటున్నారు. మరి దీనిపై రామాయణ్‌ టీమ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Updated Date - Jun 21 , 2024 | 08:46 PM