Sunny leone: భర్తనే మళ్లీ పెళ్లాడింది.. ఎందుకంటే..

ABN , Publish Date - Nov 04 , 2024 | 04:51 PM

భారత మూలాలున్న సన్నీ లియోన్‌ (Sunny leone).. ఒకప్పుడు శృంగార తార. కొన్నేళ్ల క్రితమే ఆ వృత్తిని వదిలేసి జీవితంలో సెటిల్‌ అయింది. శృంగార తార ట్యాగ్‌కు పూర్తిగా దూరమై సినిమాలు చేసుకుంటుంది.

భారత మూలాలున్న సన్నీ లియోన్‌ (Sunnyleone).. ఒకప్పుడు శృంగార తార. కొన్నేళ్ల క్రితమే ఆ వృత్తిని వదిలేసి జీవితంలో సెటిల్‌ అయింది. శృంగార తార ట్యాగ్‌కు పూర్తిగా దూరమై సినిమాలు చేసుకుంటుంది. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా ఉంది.  ఆడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఆమె ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. అదీ కూడా తన భర్తనే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అమెరికాకు చెందిన డేనియల్‌ వెబర్‌ని (Daniel Weber) ఆమె 2011లో పెళ్లి చేసుకుంది. దీని తర్వాత నిషా అనే అనాథ అమ్మాయిని ఈ జంట దత్తత తీసుకున్నారు.

Sunny-1.jpg

అనంతరం కొన్నాళ్లకు ఆషెర్‌, నోవా అనే ఇద్దరు మగపిల్లలకు సన్నీ జన్మనిచ్చింది. భర్త. పిల్లలతో చాలా సరదాగా గడుపుతుంది. పెళ్లయి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్నీ లియోన్‌.. కుటుంబంతో కలిసి మాల్దీవులకు టూర్‌ వెళ్లింది. సరదా కోసం అని కాకుండా పిల్లల సమక్షంలో భర్తను మరోసారి పెళ్లాడింది. తెల్లటి  దుస్తుల్లో రెడీ అయిన సన్నీ-డేనియల్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హిందీలో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో కరెంటు తీగ, జిన్నా, గరుడవేగ చిత్రాల్లో నటించింది. అంతే కాదు తమిళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ నటించింది. కొన్ని చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించింది. 

Daniel.jpg

Updated Date - Nov 04 , 2024 | 05:50 PM