Taapsee Pannu Marriage: రకుల్ పెళ్లయిపోయింది, ఇప్పుడు తాప్సి రెడీ అవుతోంది
ABN , Publish Date - Feb 28 , 2024 | 03:50 PM
బాలీవుడ్, టాలీవుడ్ నటి అయిన తాప్సి పన్ను త్వరలోనే వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఆమెకి పదేళ్లుగా తెలిసిన ఆమె ప్రియుడు, జాతీ బాడ్మింటన్ కోచ్ అయిన మథియాస్ ని వివాహం చేసుకోవడానికి ఈ మార్చిలో ముహూర్తం పెట్టారని భోగట్టా
కొన్ని రోజుల క్రితం అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ, ఇటు దక్షిణాదిన కూడా బిజీగా వున్న అగ్ర తారల్లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్నారు. ఆమె తన ప్రియుడు బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీని గోవాలో జరిగిన ఒక వేడుకలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకొక నటీమణి, అటు బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకొని, ఇటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసిన, తాప్సి పన్ను, వివాహం చేసుకోబోతోంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. (Taapsee Pannu is all set to tie the knot with her long time boyfriend Mathias Boe)
ఇప్పుడు ఈ బాలీవుడ్ భామ పెళ్లి ముహూర్తం కూడా ఖరారైంది అని అంటున్నారు. తాప్సీ పన్ను తన చిరకాల ప్రియుడు, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోతో పెళ్లికి సిద్ధమైంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వివాహం సిక్కు, క్రిస్టియన్ రెండు పద్ధతుల్లో జరుగుతాయని, అందుకు ఈ వచ్చే మార్చి నెలలోనే ముహూర్తం పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. (Mathias Boe is a National badminton coach)
ఈ వివాహ వేడుకలు ఉదయపూర్‌లో జరగనున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. తాప్సి వివాహం తన కుటుంబ సభ్యులు, అతి దగ్గర బంధువులు, స్నేహితులు మధ్య జరుగుతుందని వార్త. వివాహం కూడా ఈ రెండు కుటుంబాల సంప్రదాయాలను అనుసరించి జరుగుతాయని అంటున్నారు. తాప్సీ పన్ను, మథియాస్ తో పది సంవత్సరాలకు పైగా రిలేషన్‌షిప్‌లో వున్నారని, అయితే ఆమె ఎప్పుడూ దాని గురించి ఎక్కడా మాట్లాడలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఇక వివాహ సమయం వచ్చింది కాబట్టి, ఈ ఇద్దరూ తమ బంధం గురించి, వివాహం గురించి మాట్లాడతారని తెలుస్తోంది. (Taapsee and Mathias Boe is in a relationship from the last ten years, says reports)
తాప్సీ పన్ను తాజా సినిమా షారూఖ్ ఖాన్ తో నటించిన 'డంకి', దీనికి మిశ్రమ స్పందన వచ్చింది అని అంటున్నారు. ఇక చెయ్యబోయే సినిమా కామెడీ డ్రామాగా ఉంటుందని, ఆ సినిమా పేరు 'ఓ లడకీ హై కహాన్' అని వార్త. దీనికి దర్శకుడు అర్షద్ సయ్యద్. ఇందులో ప్రతీక్ గాంధీ, ప్రతీక్ బబ్బర్ లు కూడా వున్నారు. అది కాకుండా ఇంకా 'హసీన్ దిల్‌రూబా' సీక్వెల్ గా వస్తున్న 'ఫిర్ ఆయీ హస్సేన్ దిల్‌రూబా', 'ఖేల్ ఖేల్ మే' సినిమాలు చేతిలో వున్నట్టుగా తెలుస్తోంది.