Taapsee Pannu: సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది!

ABN , Publish Date - Mar 25 , 2024 | 06:55 PM

తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ 'మథియాస్‌ బో’తో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

Taapsee Pannu:  సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది!

తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ 'మథియాస్‌ బో’తో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని సమాచారం. తాజాగా ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటైనట్లు వార్తలొస్తున్నాయి. మార్చి 20న ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభమయ్యాయట. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్‌ బోతో పెళ్లి జరిగిందని.. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు టాక్‌ నడుస్తోంది. ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాప్సీ బెస్ట్‌ ఫ్రెండ్‌, ప్రొడ్యూసర్‌ కనిక తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆమె ఈ పెళ్లికే వెళ్లారంటూ పలువరు చెబుతున్నారు. ఈ వివాహ వేడుకకు అనురాగ్‌ కశ్యప్‌ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.

Taapseee.jpeg

అయితే తాప్సీ పెళ్లి చేసుకున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ‘వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమంటూ ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ నేను దేని గురించైనా ప్రకటన చేయాలనుకుంటే స్వయంగా వెల్లడిస్తాను. పెళ్లి అనేది అందరి జీవితాల్లో ముఖ్యమైన భాగం.. దాని గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’ అని స్పందించారు. 

Updated Date - Mar 25 , 2024 | 07:18 PM