Urvashi Rautela: ఏ అమ్మాయికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాకూడదు

ABN , Publish Date - Jul 28 , 2024 | 04:36 PM

'వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) చిత్రంతో ‘వేర్‌ ఈజ్‌ ది పార్టీ’ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Routela) . ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

'వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) చిత్రంతో ‘వేర్‌ ఈజ్‌ ది పార్టీ’ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Routela) . ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల ఈ భామకు చెందిన బాత్రూమ్‌ (bathroom video leak)వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే!  దీనిపై తాజాగా ఆమె స్పందించారు.
‘‘నేను నటిస్తోన్న కొత్త చిత్రం ‘గుస్పేటియా’. ఆ సినిమాలో నాపై చిత్రీకరించిన ఓ సీన్‌ ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. అది నన్నెంతో బాధించింది. సినిమా విడుదలకు ముందే వీడియోస్‌, ఫొటోలు లీక్‌ కావడం నిరాశకు గురిచేసింది. అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో కాదు. ఏ అమ్మాయికి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాకూడదని కోరకుంటా’’ అని అన్నారు. ‘గుస్పేటియా’ చిత్రానికి సూషి గణేషన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 9న ఈ చిత్రం విడుదల కానుంది. బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలోనూ ఊర్వశీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా సెట్‌లో తనకు స్వల్ప గాయాలయ్యాయని ఇటీవల ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘‘బలమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. నా క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది. బాలకృష్ణ సర్‌ గొప్ప నటుడే కాదు.. మంచి వ్యక్తి కూడా. టాలీవుడ్‌ వాతావరణం నాకు బాగా నచ్చింది. భవిష్యత్తులోనూ మరిన్ని అవకాశాలు ఇక్కడ అందుకుంటానని ఆశిస్తున్నా’’ అని అన్నారు. 

Updated Date - Jul 28 , 2024 | 04:39 PM