6th Journey: ‘6th జర్నీ’ మూవీ టీజర్ విడుదల..

ABN , Publish Date - Sep 06 , 2024 | 06:46 PM

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6th జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6th జర్నీ’ (6th Journey). రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌కు సిద్ధ‌మైన ఈ సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజ‌ర్‌ను పటేల్ రమేష్ రెడ్డి చేతుల మీదుగా మేకర్స్ విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా టీజర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి, దర్శకుడు బషీర్ మూవీని తెర‌కెక్కించిన విధానం బావుంది. ఆయ‌న‌తో పాటు సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా బాగుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. (6th Journey Movie Teaser Launched)

Also Read- Tollywood - Vinayaka Chavithi: దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. కరుణించయ్యా దేవా..


దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చి మా టీమ్‌ని ఆశీర్వదించిన రమేష్ రెడ్డి అన్నకి, వెంకట్ రెడ్డి అన్నకి, ప్రతాప్ రెడ్డి అన్నకి థాంక్స్. మాకోసం వచ్చిన మీడియా వారికి థాంక్స్. మా హీరో సమీర్ ఎంతో కష్టపడి నటించారు. రవి ప్రకాష్ రెడ్డి ఈ మూవీని ముందుండి నడిపించారు. మా హీరోయిన్లు అద్భుతంగా నటించారు. టేస్టి తేజ ఎనర్జీతో నటించాడు. మాకు సింహ గారు మంచి పాటలు ఇచ్చారు. సురేందర్ రెడ్డి గారు మా అందరికీ టీచర్. ఈ మూవీ ఇక్కడకు వచ్చిందంటే అది ఆయన వల్లే. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతకు ధన్యవాదాలు అని తెలిపారు.


6th-Journey-Team.jpg

నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాను నిర్మించడం, ఇందులో నటించడం ఆనందంగా ఉంది. అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. డైరెక్ట‌ర్ బసీర్‌ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆయ‌న‌ చాలా ప్లానింగ్‌తో ఉండ‌టం వ‌ల్ల అనుకున్న‌ట్లే సినిమాను బెస్ట్‌గా రూపొందించ‌గ‌లిగాం. టీజర్ అందరికీ నచ్చేలా ఉంది. చిత్రం కూడా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సమీర్ దత్త.. హీరోయిన్లు పల్లవి, రమ్యకృష్ణ, అవంతికలతో పాటు టేస్టీ తేజ వంటి వారు మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Sep 06 , 2024 | 06:46 PM