యాక్షన్ థ్రిల్లర్
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:14 AM
పూర్వజ్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కిల్లర్’. పూర్వజ్, ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్, వికారాబాద్ పరిసర...
పూర్వజ్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కిల్లర్’. పూర్వజ్, ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో హీరో పూర్వజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొన్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో మరో హీరో విశాల్ రాజ్ పాల్గొంటారు. రామోజీ ఫిల్మ్ సిటీ, మొయినాబాద్ లోకేషన్స్‌లో జరిగే ఈ చిత్రీకరణలో గౌత్‌మ్, జ్యోతి పూర్వజ్ పాల్గొంటారు.