Adithirao Hydari: రొమాంటిక్ ఫొటోతో క్లారిటీ ఇచ్చినట్టేనా
ABN , Publish Date - Jan 02 , 2024 | 12:14 PM
సిద్దార్థ్(Siddarth) , అదితి రావు హైదరి (Adithirao hydari)మధ్య కుచ్ కుచ్ హోతా హై అని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం’ చిత్రంలో నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారం నడుస్తోంది
సిద్దార్థ్(Siddarth) , అదితి రావు హైదరి (Adithirao hydari)మధ్య కుచ్ కుచ్ హోతా హై అని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం’ చిత్రంలో నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారం నడుస్తోంది. ఓ సందర్భంలో అలాంటిది ఏమీ లేదంటూ సెలవిచ్చారు. కానీ తరచూ పార్టీలకు, షికార్లకు వెళ్తూనే ఉన్నారు. కనిపించారు. హిట్ పాటలకు రీల్స్ కూడా చేశారు. ఇద్దరూ కలిసి ఎన్నోసార్లు కెమెరాకు చిక్కారు. తాజాగా మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచారు. తాజాగా అదితీరావు హైదరీ సిద్దార్థ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసి 'హ్యాపీ బ్లెస్డ్ గ్రేట్ఫుల్’ అని పోస్ట్ చేసింది. 'మ్యాజిక్ చేయాలంటే.. ఆనందం, ప్రేమ, నవ్వులు, ఇంద్రదనస్సు..ఉండాలి. ఇవన్నీ నీతోనే సాధ్యం అనే అర్థం వచ్చేలా ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య ఉన్న లవ్‌స్టోరీని అఫీషియల్‌గా చెప్పారనే ఊహల్లో ఉన్నారు. ఇంతకీ సిద్ధార్థ్, అదితీల మధ్యనున్న ప్రేమకు ఇది అఫీషియల్ అనౌన్స్ మెంట్ అనుకోవచ్చా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కొందరు అయితే ప్రేమ ఓకే.. మరి పెళ్లెప్పుడూ? అంటూ వరుస ట్వీట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయంఐ సిద్ధార్థ్ మాత్రం నోరు విప్పట్లేదు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ అలాంటిడి ఏమన్నా ఉంటే నేనే చెప్తానంటూ మాట దాటవేసింది. అయినా నేనేం చెప్పినా చివరకు మీకు నచ్చినట్లుగానే ఊహించుకుంటారుగా అని కౌంటర్ కూడా వేసింది.