Kanguva: ఎఐతో డబ్బింగ్.. ప్రభాస్ అయితే బాగుండేది

ABN , Publish Date - Oct 14 , 2024 | 03:58 PM

ఈ సినిమా కోసం ఎఐతో పాటు ప్రభాస్‌ని వాడుకోవాలని చిత్ర బృందం ప్రయత్నిస్తుంది. ఎలా అంటే..

Surya with Prabhas

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎఐతో పాటు ప్రభాస్‌ని వాడుకోవాలని చిత్ర బృందం ప్రయత్నిస్తుంది. ఎలా అంటే..


అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యే అవకాశముంది. ఈ సినిమా నిర్మాణంలో యువి క్రియేషన్స్ భాగ్యస్వాములు కావడంతో ఆయనకు ఇప్పటికే ఇన్విటేషన్ వెళ్లినట్లు టాక్. అయితే హను రాఘవపూడి 'ఫౌజి' ఫిల్మ్ షూటింగ్ లో బిజీబిజీగా ఉన్న డార్లింగ్ ఈవెంట్ కి హాజరవడంపై సందిగ్థత ఏర్పడింది. మరో వైపు యువి క్రియేషన్స్ పిలిస్తే ప్రభాస్ తప్పకుండ వస్తారని.. సూర్య కోసం ప్రభాస్ వస్తే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


'కంగువా' చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 8 భాషల్లో ఏకకాలంలో రిలీజ్‌ చేయనున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఎక్స్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన ‘కంగువా’లో ఏఐని ఉపయోగించినట్లు చెప్పారు. ‘‘తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా.. మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేయనున్నాం. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారి.

Updated Date - Oct 14 , 2024 | 03:58 PM