Anjali: అంజలి 38వ పుట్టినరోజు ఎక్కడ సెలెబ్రేట్ చేసుకున్నారో తెలుసా
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:45 PM
తమిళ, తెలుగు, మలయాళంలో బిజీగా వున్న నటీమణుల్లో అంజలి ఒకరు. ఈమధ్యనే విడుదలైన 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమాలో రత్నమాలగా విమర్శకుల ప్రశంశలు అందుకున్న అంజలి, సినిమాలనుండి బ్రేక్ తీసుకొని తన 38వ పుట్టినరోజు ఘనంగా విదేశంలో జరుపుకున్నారు
'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమాలో రత్నమాలగా నటించి మంచి మార్కులు కొట్టేసిన నటి అంజలి తన 38వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. సినిమాలకి కొన్ని రోజులు బ్రేక్ చెప్పి థాయిలాండ్ వెళ్లి అక్కడ తన పుట్టినరోజు పండగ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన సామజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో తన పుట్టినరోజు వేడుక నుండి కొన్ని ఫోటోలను అంజలి తన అభిమానుల కోసం పోస్ట్ చేశారు.
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'గేమ్ చేంజర్' సినిమాలో ఆమె ఒక కథానాయికగా నటిస్తున్నాను అని చెప్పారు. అందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో రామ్ చరణ్ పక్కన నటిస్తున్నారు అంజలి. ఈ సినిమా చిత్రీకరణ కూడా దాదాపు పూర్యయినట్టే అని భావిస్తున్నారు.
ఇది కాకుండా ఇంకో తెలుగు సినిమా కూడా ఒప్పుకున్నట్టుగా చెపుతున్నారు అంజలి. సినిమాలు కాకుండా 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్ నుంచి ఆమె లుక్ కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. తెలుగు సినిమాలే కాకుండా మూడు తమిళ సినిమాలు కూడా ఒప్పుకున్నాను అని ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే మలయాళం సినిమా కూడా చేస్తున్నట్టు చెప్పారు.
ఇలా తెలుగు, తమిళ, మలయాళం సినిమాలలో బిజీగా వున్న అంజలి ఈమధ్య ఒక వివాదంలో కూడా వున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిధిగా వచ్చిన 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' ప్రీ విడుదల వేడుకలో బాలకృష్ణ, అంజలిని పక్కకి తోసెయ్యడం కొంచెం వివాదం అయింది. అయితే తరువాత అంజలి అతను సరదాగా ఎదో అన్నారని, అంతే కానీ బాలకృష్ణ కావాలని తనని అలా పక్కకి నెట్టలేదని చెప్పారు అంజలి.
ఆ వివాదంపై అంజలి వివరణ ఇచ్చారు. అయితే అంతకు ముందు బాలకృష్ణ, అంజలి సరదాగా మాట్లాడుకోవటం అందరూ చూశారు. అందుకని బాలకృష్ణ ఎదో సరదాగా చేసినపని కానీ, కావాలని అంజలిని నెట్టలేదని, ఆ చిత్ర నిర్మాత, కథానాయకుడు కూడా ఆ సంఘటనపై వివరణ ఇచ్చారు. అసలు అది పెద్ద విషయం కాదనట్టుగానే మాట్లాడారు.