Anupama Parameswaran: ఇంకా అందంగా తయారైన అనుపమ, తగ్గేదే లే!

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:48 PM

అనుపమ పరమేశ్వరన్ ఒక మంచి టాలెంటెడ్ యాక్ట్రెస్. ఎటువంటి పాత్ర అయినా అవలీలలుగా చేస్తూ ఆ పాత్రలో ఇమిడిపోతుంది. తెలుగులో 'టిల్లు స్క్వేర్' సినిమాతో మంచి విజయం సాధించిన అనుపమ ఇప్పుడు ఏ సినిమాలు చేస్తోంది, ఎటువంటి పాత్రలు చేస్తోంది అంటే...

Anupama Parameswaran

'టిల్లు స్క్వేర్' సినిమా ఘన విజయం సాధించటంతో అనుపమ తెలుగులో చాలా సినిమాలు చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఆసక్తికరంగా ఆమె తెలుగు కన్నా, మలయాళం, తమిళ సినిమాలతో చాలా బిజీగా వుంది. తెలుగులో 'పరదా' అనే సినిమా మాత్రమే చేస్తోంది, అది ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అని అంటున్నారు.

anupamaparameswaranlatestpi.jpg


'టిల్లు స్క్వేర్' సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ పక్కన చేసిన అనుపమ, ఆ సినిమాలో తను ఇంతకు చేయనటువంటి గ్లామర్ వైపు వున్న కోణాన్ని కొత్తగా ఆవిష్కరించింది. అందులో చాలా గ్లామరస్ గా కనపడటమే కాకుండా, తాను అవసరమైతే గ్లామర్ పాత్రలకు రెడీ అన్న సంకేతాలని పంపించింది అని కూడా అంటారు. ఆ సినిమాలో అనుపమ కన్నా సిద్ధు జొన్నలగడ్డ మొత్తం క్రెడిట్ కొట్టేసాడు.

anupamalatestpica.jpg


అనుపమకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయర్స్ ఎక్కువ. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆమెకి 16.3 మిలియన్ ఫాలోయర్లు వున్నారు. ఆమె ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ లో తన తాజా ఫోటోలు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటుంది. తమిళంలో 'బైసన్', 'లాక్ డౌన్' అనే రెండు సినిమాలలో నటిస్తోంది. 'బైసన్' లో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా చేస్తున్నాడు. మారి సెల్వరాజ్ దర్శకుడు, ఇది ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో వుండే సినిమా అని అంటున్నారు.

anupamalatestpic.jpg


ఇంకో తమిళ సినిమా 'లాక్ డౌన్'. దీనికి ఏఆర్ జీవా దర్శకుడు, ఇందులో అనుపమ ఒక వైవిధ్యమైన పాత్రలో కనపడనుందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా లుక్ ఆమధ్య విడుదల చేసినప్పుడు అందులో అనుపమ ప్రధాన పాత్రలో కనపడనుందని, ఆమెపైనే సినిమా అంతా నడుస్తుందని తెలుస్తోంది. ఈ రెండు తమిళ సినిమాలు కాకుండా మలయాళం సినిమాలు కూడా చేస్తోంది. అందులో 'పెట్ డిటెక్టివ్' ఒకటి, దీనికి ప్రణీష్ విజయం దర్శకుడు, ఇది ఒక రొమాంటిక్ కామెడీ అంటున్నారు.

anupamalatestpicture.jpg


ఇంకొక మలయాళం సినిమా టైటిల్ 'జెఎస్కె: ట్రూత్ షల్ ఆల్వేజ్ ప్రివైల్' అనేది. ఇందులో సురేష్ గోపి ఒక ముఖ్యపాత్రలో కనపడనున్నారని తెలుస్తోంది. ఇది ఒక కోర్టు డ్రామాగా తెరకెక్కుతోందని అంటున్నారు. సురేష్ గోపి లాయర్ పాత్రలో కనపడతారని అంటున్నారు. సురేష్ గోపి చిన్న కుమారుడు మాధవి గోపి కూడా ఈ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నట్టుగా తెలిసింది. ఇలా రెండు తమిళం, రెండు మలయాళం, ఒక తెలుగు సినిమాతో అనుపమ బిజీగా వుంది.

anupamalatestone.jpg

Updated Date - Jul 27 , 2024 | 05:57 PM