AR Rahman: కాపీ మాస్టర్లపై రెహమాన్ యాంగ్రీ
ABN , Publish Date - Oct 27 , 2024 | 03:12 PM
మ్యూజిక్‌లో కూడా ఏఐ (Artificial Intelligence) వచ్చిన తరుణంలో రెహమాన్ మరోసారి కాపీ మాస్టర్లపై మండిపడ్డారు. ఇంతకీ ఏమైందంటే..
ఏఆర్ రెహమాన్ (AR Rahman).. వెరీ కామ్ అండ్ కూల్ మ్యూజిక్ కంపోజర్. వ్యక్తిగతంగా కూడా ఎవరిపై అనవసర కామెంట్స్ చేయకుండా కూల్‌గా ఉంటారు. అలాంటి రెహమాన్‌కి కోపం వచ్చింది. గతంలోనూ పాత పాటలను రీమిక్స్ చేసే కల్చర్‌పై ఆయన మండిపడ్డారు. ముకాబులా, ఊర్వశీ లాంటి తన పాటలను రీమిక్స్ చేయడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఒకరు చేసిన పాటను రీమిక్స్ చేస్తే అందులో ఎం క్రియేటివిటీ ఉంటుందని అన్నారు. కనీసం అనుమతులు తీసుకోకుండా ఇలా చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మ్యూజిక్‌లో కూడా ఏఐ (Artificial Intelligence) వచ్చిన తరుణంలో రెహమాన్ మరోసారి కాపీ మాస్టర్లపై మండిపడ్డారు. ఇంతకీ ఏమైందంటే..
ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్‌ని రీమిక్స్ చేసే కాల్చారు చాల ఏళ్ల నుండి ఉంది. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఏఐ వచ్చిన తర్వాత మరణించిన లెజండరీ సింగర్స్ వాయిస్‌ని కూడా వాడుతూ ఓల్డ్ క్లాసికల్ సాంగ్స్‌ని రీమిక్స్ చేస్తున్నారు. ఈ శైలిపై లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మరోసారి మండిపడ్డారు. ‘‘ఆరేళ్ల కిందట సూపర్ హిట్ అయిన పాటను ఇప్పుడు కాపీ కొట్టి.. రీమిక్స్ చేశా అని గొప్పగా చెబుతున్నారు. అలా చేయడం తప్పు. ఒరిజినల్ సాంగ్‌ను క్రియేట్ చేసిన వ్యక్తి అనుమతి తీసుకోకుండా ఇలా ఎలా చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంగీతంలోనూ ఏఐని ఉపయోగిస్తున్నారు. కంపోజింగ్ స్టైల్ కాపీ కొట్టినప్పటికీ అతడికి డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. భవిష్యత్తులో ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. నైతిక సమస్యలు ఏర్పడతాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది’’ అంటూ ఆయన సీరియస్ అయ్యారు
Also Read-Nandamuri Balakrishna: తెలంగాణలో ‘బాలకృష్ణ ఫిలిం స్టూడియో’.. నిజమేనా?
మరోవైపు రీమిక్స్ పాటల విషయంలో న్యూ కంపోజర్స్ సినిమా నిర్మాతల నుండి అనుమతి తీసుకుంటున్నారు తప్ప ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి అనుమతులు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు విమర్శలు రావడంతో రెహమాన్ కూడా వారికి గొంతందించారు. ఇలాంటి కల్చర్‌ని తాను ఫాలో కాను.. వేరే వాళ్లు ఇలా చేస్తే సమర్ధించాను అంటూ క్లారిటీ ఇచ్చారు.