మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:19 AM
ఇటీవలే ‘హనీ బన్నీ’తో ప్రేక్షకులను పలకరించారు సమంత. ప్రస్తుతం ఆమె మరో వెబ్ సిరీస్ ‘రక్త్‌బ్రహ్మాండ్’లో నటిస్తున్నారు. ‘ద బ్లడీ కింగ్‌డమ్’ అనేది ఉపశీర్షిక. తాజాగా, కొద్ది గ్యాప్ తర్వాత ఈ సిరీస్ సెట్స్‌లోకి...
ఇటీవలే ‘హనీ బన్నీ’తో ప్రేక్షకులను పలకరించారు సమంత. ప్రస్తుతం ఆమె మరో వెబ్ సిరీస్ ‘రక్త్‌బ్రహ్మాండ్’లో నటిస్తున్నారు. ‘ద బ్లడీ కింగ్‌డమ్’ అనేది ఉపశీర్షిక. తాజాగా, కొద్ది గ్యాప్ తర్వాత ఈ సిరీస్ సెట్స్‌లోకి ఆమె తిరిగి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బ్యాక్ టూ యాక్షన్ మోడ్ అని పేర్కొన్నారు. 2018లో విడుదలైన హారర్ చిత్రం ‘తుమ్‌బాడ్’తో గుర్తింపు తెచ్చుకున్న అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యాంటసీ వెబ్‌సిరీస్‌ను రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్నారు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ఆదిత్యరాయ్ కపూర్, ఆలీ ఫాజల్, వామికా గబ్బీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.