Bagheera: పవర్ ఫుల్‌గా ‘బఘీర’ ఫస్ట్ సింగిల్ యాంథమ్ ఆఫ్ జస్టిస్

ABN , Publish Date - Oct 18 , 2024 | 11:32 AM

‘ఉగ్రమ్’ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి నటిస్తోన్న ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బఘీర’. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ అందిస్తోన్న ఈ మూవీ నుండి తాజాగా ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ పవర్ ఫుల్‌గా ఉండటమే కాకుండా.. వినగానే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.

Bagheera Movie Still

‘ఉగ్రమ్’ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి (Sriimurali) నటిస్తోన్న ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బఘీర’ (Bagheera). ఇది శ్రీమురళికి ఫస్ట్ తెలుగు రిలీజ్. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘రుధిర హర’ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు.

Also Read- Music Directors: టాలీవుడ్‌లో తమిళ కంపోజర్‌ల హవా..

‘రుధిర హర’ (Rudhira Haara) సాంగ్ విషయానికి వస్తే.. న్యాయానికి సంబంధించిన ఈ సాంగ్ అనేక రకాల భావోద్వేగాలతో పవర్ ఫుల్ కంపోజిషన్‌తో ఆకట్టుకుంటోంది. రాంబాబు గోసాల ఇంపాక్ట్ ఫుల్ లిరిక్స్ బ్యాక్ డ్రాఫ్‌ని పవర్ ఫుల్‌గా ప్రజెంట్ చేస్తుండగా.. అనిరుద్ధ శాస్త్రి డైనమిక్‌ వోకల్స్‌తో ఈ పాటకు మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. సినిమాలో ఇంటెన్స్ యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుందని ఈ సాంగ్ తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Allu Arjun: యూపీ నుంచి సైకిల్‌పై.. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో..


Bagheera.jpg

‘బఘీర’ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఎజె శెట్టి డీవోపీ కాగా, ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్, రవి సంతేహక్లు ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పలు బ్లాక్‌బస్టర్‌లను విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసిన టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు ఈ సినిమా ముస్తాబవుతోంది.

Also Read- Salman Khan: సల్మాన్ ఇంటి దగ్గర ఫైర్.. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అరెస్ట్

Also Read- Ram Charan: నిండైన మనసుతో పాపకు ప్రాణం పోశాడు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 18 , 2024 | 11:32 AM