Bahirbhoomi: ‘బహిర్భూమి’.. ఈ మాటకు ఎంతో చరిత్ర ఉంది

ABN , Publish Date - Sep 29 , 2024 | 07:17 PM

నోయల్, రిషిత నెల్లూరు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బహిర్భూమి’. ఈ చిత్రాన్ని మహాకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకుడు. అక్టోబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..

Bahirbhoomi Pre Release Event

నోయల్, రిషిత నెల్లూరు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని మహాకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకుడు. అక్టోబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నోయల్ మాట్లాడుతూ.. ‘బహిర్భూమి’.. ముందుగా ఈ టైటిల్‌తో మూవీ చేసిన నిర్మాత మచ్చ వేణు మాధవ్‌కు నా అభినందనలు. ఆయన ఇండస్ట్రీలో వంద సినిమాలు చేయాలి. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ మన పరిశ్రమలో కొనసాగాలి. అలాగే మా డైరెక్టర్ రాంప్రసాద్‌కు ఇది ఫస్ట్ మూవీ. అయినా సరే.. చాలా బాగా సినిమాను తెరకెక్కించాడు. సినిమాలోని అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా కోసం మా మూవీ టీమ్ ఎంతో కష్టపడింది. ఈ సినిమాను థియేటర్లలో చూసి అంతా ఎంజాయ్ చేస్తారని కోరుతున్నానని అన్నారు.

Also Read- Tollywood: ఈ సమ్మర్‌కి మరింత వేడి!

నిర్మాత మచ్చ వేణు మాధవ్ మాట్లాడుతూ.. మా సినిమాకు సెట్ బాయ్ నుంచి హీరో వరకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి మూవీ నిర్మించినందుకు ఆనందంగా ఉంది. అక్టోబర్ 4న ‘బహిర్భూమి’ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లో ఇతర భాషల్లోనూ మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆదివారం సాయంత్రం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ పై మా మూవీ ట్రైలర్‌ను డిస్‌ప్లే చేస్తాం. హాష్ ట్యాగ్ ‘బహిర్భూమి’ అని సోషల్ మీడియా‌లో పోస్టులు చేసిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 వేల రూపాయల బహుమతి అందిస్తాం. థియేటర్‌లో మా ‘బహిర్భూమి’ సినిమా చూస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.

Also Read- Sai Durgha Tej: మేనమామల దారిలో సాయి దుర్గ తేజ్.. తగ్గేదేలే


Bahirbhoomi.jpg

దర్శకుడు రాంప్రసాద్ కొండూరు మాట్లాడుతూ.. ‘బహిర్భూమి’ అనే మాటకు ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో రెండు ఊర్ల మధ్యలో బహిర్భూమి ప్లేస్ కోసం గొడవలు జరిగేవి. ఈ టైటిల్ సినిమాకు ఎందుకు పెట్టామో మూవీ చూస్తే తెలుస్తుంది. మా నిర్మాత చాలా మంచి వారు. అలాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో స్థిరపడాలి. మా సినిమాకు హీరో నోయల్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇచ్చిన సపోర్ట్‌తో ప్రేక్షకులకి నచ్చేలా సినిమా చేయగలిగాను. థియేటర్‌లో మా సినిమాను అక్టోబర్ 4న చూసి మీ ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ రిషిత, హీరోయిన్ గరిమా సింగ్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్, జబర్దస్త్ ఫణి, నటుడు చిత్రం శ్రీను, డిఓపి ప్రవీణ్ వంటివారంతా ప్రసంగించారు.

Also Read- Prakash Raj: గుడికెళ్లిన ప్రకాష్ రాజ్.. ఫ్యాన్స్ ఫైర్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2024 | 07:23 PM