My Dear Donga: యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయ్..
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:20 AM
అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.
అభినవ్ గోమటం (Abhinav Gomatam) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’ (My Dear Donga). శాలిని కొండెపూడి (Shalini Kondepudi), దివ్య శ్రీపాద (Divya Sripada), నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ (Cam Entertainment) బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి (Maheshwar Reddy) నిర్మించిన ఈ చిత్రం తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ (Aha OTT)లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి (Priyadarshi) ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
*Sundarakanda: ఏ ఇద్దరూ.. ఒకేలా ప్రేమించలేరు! మరోసారి నారావారబ్బాయి అదరగొట్టాడుగా
ట్రైలర్ విడుదల అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘శాలిని, అభినవ్ నా ఫ్రెండ్స్. వాళ్లని సపోర్ట్ చేద్దామని నేను వచ్చాను. మేమంతా ఎక్కడో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండేవాళ్లం. ఒకప్పుడు ఇక్కడ సినిమా స్క్రీనింగ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. కానీ ఇప్పుడు ఈ స్టేజీ మీద ఉండడం చాలా బాగుంది. యాక్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నా అవకాశాలు రాకపోవడంతో తన స్క్రిప్ట్ తనే రాసుకుని మీ ముందుకు వస్తోంది శాలిని. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయన్నట్లు శాలినీని వెతుక్కుంటూ ఆహా వచ్చింది. మిమ్మల్ని మీరు నమ్మితే అనుకున్నది సాధిస్తారు. అందుకు శాలినీయే ఉదాహరణ. ఈ సినిమా ఆమె కోసం సక్సెస్ అవ్వాలి. మంచి సినిమాలకు ఆహా సపోర్ట్ చేయడం నిజంగా మంచి విషయం. టాలెంట్ ఉన్నవాళ్లకు ఆహా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. (My Dear Donga Trailer Launch Event)
హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచి దీనికోసం పని చేస్తున్నవాళ్లను నేను కలుస్తున్నా. ఆహా కంటెంట్ హెడ్ వాసు ప్రతి ఒక్కరికీ సపోర్ట్ చేస్తుంటాడు. ఆహా టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఫస్ట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వాళ్లదగ్గర నుంచే వచ్చింది. ఈ కంటెంట్ మొత్తం నేను చూశాను. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. శాలిని, నేను పదేళ్ల నుంచి ఫ్రెండ్స్. ప్రియదర్శి నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు శాలిని స్క్రిప్ట్‌లో యాక్ట్ చేశా. ఆమె చాలా సెన్సిబుల్. ఆమె ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. ఒక మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలపగా.. హీరోయిన్, రైటర్ శాలిని మాట్లాడుతూ.. ముందుగా ఆహాకు థ్యాంక్స్. నా స్క్రిప్ట్‌ను, నా యాక్టింగ్‌ను ఆహా టీమ్ ఎంతగానో నమ్మారు. నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్లే. ఈ మధ్య చాలామంది యాక్టర్స్ రైటింగ్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ నేను ఈ ఐడియా అనుకున్నప్పుడు వంశీని తీసుకున్నా. నేను ఏదైనా జోక్ చెప్తే వంశీ ఇంప్రవైజ్ చేశాడు. ట్రైలర్‌లో ఉన్న ఒక డైలాగ్‌ను కూడా వంశీ ఇంప్రూ చేశాడు. నేను, ప్రియదర్శి, అభినవ్ గోమటం ముగ్గురూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌కు థ్యాంక్స్ చెప్పకూడదని అంటారు. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ వస్తుందో అని భయపడ్డా. కానీ ఇప్పుడే సక్సెస్ వైబ్స్ వస్తున్నాయి. నాకు సహకరించిన అందరికీ థ్యాంక్స్ అని తెలిపారు.
నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మై డియర్ దొంగ’ (My Dear Donga Movie) అంటే ఈ టీమ్‌లో శాలిని. ఆమె ఒక స్టోరీ రాసి, అందులో నటించడం అంటే చాలా గొప్ప విషయం. ఆమె ఒక డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను ఇంత సక్సెస్ చేయడంలో ఆమే కీలకం. తర్వాత ఆహా ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించింది. ఎంతోమంది కొత్త టాలెంట్‌ను గుర్తించి వాళ్లకు క్రియేటివ్ ఫ్రీడమ్‌ను ఇచ్చింది ఆహా. చాలా తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైమ్‌లో మంచి అవుట్‌పుట్ ఇచ్చిన డైరెక్టర్ సర్వాంగ (B S Sarwagna Kumar) రియల్లీ గ్రేట్. మ్యూజిక్ ఈ సినిమాకు గ్రేట్ ఎసెట్. శాలిని, అభినవ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. క్యామ్(CAM) ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ముగ్గురు వ్యక్తులు. వాళ్లు చంద్ర, అభిలాష్, మహేశ్. కొత్తవాళ్లతో మేము ఫ్రెండ్లీగా సినిమాలు చేయాలనుకుంటున్నాము. మంచి స్టోరీస్ ఉన్నవాళ్లు మమ్మల్ని సంప్రదించండని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆహా కంటెంట్ హెడ్ వాసు, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా.. చిత్రంలో నటించిన నిఖిల్, స్నేహల్, దివ్య శ్రీపాద, శశాంక్, వంశీ వంటి వారు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.