Ram Karthik - Veekshanam: లవ్ స్టోరీతో మొదలై ఎక్కడివరకు వెళ్తుందంటే

ABN , Publish Date - Oct 15 , 2024 | 06:16 PM

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'వీక్షణం'.  ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు.

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'వీక్షణం'.  ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ..  గతేడాది 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'   మూవీ చేశాను. అది ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లోనే డైరెక్టర్ మనోజ్ పల్లేటి "వీక్షణం" మూవీ స్క్రిప్ట్ చెప్పారు.    ఇప్పటిదాకా  విన్న కథలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ 'వీక్షణం' కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి.  

'వీక్షణం' సినిమాలో సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్నెస్ వైపు మళ్లుతుంది. సరదాగా ఉండే ఆ యువకుడు...డిటెక్టివ్ లా మారి తన చుట్టూ జరుగుతున్న విషయాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు. లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి మిస్టరీ థ్రిల్లర్ గా మారుతుంది. నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. నేను నా గత మూవీస్ తో చూస్తే ఇందులో మెచ్యూర్డ్ గా, సెటిల్డ్ చేశా అంటున్నారు.  

థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అందుకే మా డైరెక్టర్ మనోజ్ స్క్రిప్ట్ పలు వెర్షన్స్ రాసుకున్నారు. స్క్రీన్ ప్లేలో హుక్ పాయింట్స్ ఉండేలా చూసుకున్నారు. మా మూవీలో ప్రీ క్లైమాక్స్ ను ఎవరూ ఊహించలేరు.  హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.  మూవీలో భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో చూపెడుతుంది. మా మూవీకి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు డీవోపీ సాయి రామ్, సమర్థ్ మంచి మ్యూజిక్ చేశారు. డిఫరెంట్ టైప్స్ సాంగ్స్ చేశారు.  డైరెక్టర్ మనోజ్ కొత్త వారు కాబట్టి ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు మొదట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు.  మా ప్రొడ్యూసర్ అశోక్ గారు మనోజ్ ఒకే ఊరివారు కావడంతో కథ నచ్చి వెంటనే మూవీ స్టార్ట్ చేశారు. 

Updated Date - Oct 15 , 2024 | 06:16 PM