Love Reddy: ‘ప్రాణం కన్నా..’ ఎమోషనల్ సాంగ్ విడుదల.. పాట పాడిందెవరో తెలుసా

ABN , Publish Date - Oct 09 , 2024 | 10:33 AM

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు‌గా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే వదిలిన పాట మంచి ఆదరణను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌ను వదిలారు. ఎంతో హార్ట్ టచ్చింగ్‌గా ఉన్న ఈ పాటను ఎవరు పాడారంటే..

Love Reddy Movie Still

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’ (Love Reddy). అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు‌గా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి. రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి ఈ ‘లవ్ రెడ్డి’ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘ప్రాణం కన్నా’ (Pranam Kanna Lyrical Song) అనే ఎమోషనల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో షాయాజీ షిండే భేటీ.. ప్రయత్నం ఫలిస్తుందా

‘‘ప్రాణం కన్నా.. ప్రేమించినా..

ఆ ప్రేమనే పెంచావుగా..

మేఘాలు దాటినాకా.. దూరాలు సాగినాకా..

నన్నింక వీడమంటూ.. పొమ్మందిగా..

ఆ బంధం అబద్ధమా.. ఆ స్నేహం అబద్ధమా..

నీతోనే నా ఊహలే.. అబద్ధమా..

ఆ కాలం అబద్ధమా.. ఆనందం అబద్ధమా..

నడిచేటి ఆ దారులే.. అబద్ధమా..’’ అంటూ సాగిన ఈ పాటని ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ఆలపించారు. ఆయన వాయిస్‌లో ఈ పాట హార్ట్ టచ్చింగ్‌గా ఉంది.


Love-Reddy-Still.jpg

హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ సాంగ్‌గా వచ్చిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రిన్స్ హెన్రీ (Prince Henry) కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణ కాంత్ (Krishna Kanth) లిరిక్స్ అందించారు. నిజమైన ప్రేమికుడి బాధను వ్యక్తం చేస్తూ సాగుతుందీ పాట. ఈ పాటకు సినిమాలో ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పాటలన్నీ చాలా బాగుంటాయని, ప్రిన్స్ హెన్రీ అద్భుతమైన పాటలు ఇచ్చాడని, సినిమా సక్సెస్‌కు ఒక మెయిన్ పిల్లర్‌గా ఈ మూవీ సంగీతం ఉంటుందని ఈ పాట విడుదల సందర్భంగా దర్శకనిర్మాతలు తెలిపారు.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2024 | 10:33 AM