Evaru Enduku: రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి వదిలిన ‘ఎవరు ఎందుకు’ ఫస్ట్ లుక్

ABN , Publish Date - Jul 07 , 2024 | 09:26 PM

వీటి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రవి సిరోర్, నివిష్క పాటిల్ హీరోహీరోయిన్లుగా ఎస్‌జి‌ఆర్ దర్శకత్వంలో ప్రభాస్ ఫ్యాన్స్ హిందూపూర్ ప్రెసిడెంట్‌ జి. వెంకటేష్ రెడ్డి నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఎవరు ఎందుకు’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఆవిష్కరించారు.

Evaru Enduku First Look Launch

వీటి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రవి సిరోర్, నివిష్క పాటిల్ హీరోహీరోయిన్లుగా ఎస్‌జి‌ఆర్ దర్శకత్వంలో జి. వెంకటేష్ రెడ్డి నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఎవరు ఎందుకు’ (Evaru Enduku). షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి (Shyamala Devi) ఆవిష్కరించారు. అలాగే ఈ చిత్ర లిరికల్ సాంగ్‌ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హీరో రవి సిరోర్, సంగీత దర్శకులు సతీష్ ఆర్యన్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ.. వెంకటరెడ్డి ప్రభాస్ ఫ్యాన్స్ హిందూపూర్ ప్రెసిడెంట్‌గా ఎప్పటినుంచో ఉన్నారు. ఆయన మా ఫ్యామిలీ మొత్తానికి అభిమాని. అటువంటి ఆయన ఇప్పుడు నిర్మాతగా మారడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ప్రముఖ నటుల ఫొటోల మధ్యన, ఫిలిం ఛాంబర్‌లో ఈ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ చూస్తుంటే మహానటుల దీవెన వీళ్లకు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి సినీ పరిశ్రమకు ఒక డైరెక్టర్ రావాలి, ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఒక యాక్టర్ రావాలి. మాతోపాటు మా అభిమానులు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నానని అన్నారు. (Evaru Enduku First Look Launch)


Evaru-Enduku.jpg

చిత్ర నిర్మాత వెంకటేష్ రెడ్డి (Producer Venkat Reddy) మాట్లాడుతూ.. మా ఆరాధ్య దైవం రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సతీమణి చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ జరగటం ఎంతో సంతోషంగా ఉంది. దీనికి కారకులైన మా కృష్ణంరాజు అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్ ఇండియా అధ్యక్షులు శాస్త్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రం. ఖచ్చితంగా అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నానని తెలపగా.. చిత్ర డైరెక్టర్ ఎస్.జి.ఆర్ (SGR) మాట్లాడుతూ.. మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాము. మూడు పాటలుంటాయి. అవి నేనే రాశాను. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రం చూసి ఆశీర్వదించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 07 , 2024 | 09:26 PM