Fahadh Faasil: షెకావత్ సార్.. ఎందుకిలా?
ABN , Publish Date - Oct 12 , 2024 | 08:26 AM
రీసెంట్గా రిలీజైన రజినీ 'వేట్టయన్' సినిమాలో బ్యాటరీ రోల్లో దొంగ నుండి పోలీస్ ఇన్ఫార్మర్గా మారిపోయే పాత్రలో అదరగొట్టాడు. అయితే ఆయన సినిమాలు తీసే విధానంపై ఆడియెన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే..
ఫహద్ ఫాసిల్ అతితక్కువ కాలంలోనే దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కేవలం మలయాళం సినిమాల్లోనే కాకుండా ఇతర భాష చిత్రాలలోనూ నటిస్తూ.. ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఆయన సినిమా ఏదైనా.. డబ్బింగ్ లాంగ్వేజ్‌లో లేకున్నా చూసే ఆడియెన్స్ దేశం మొత్తం ఉన్నారంటే ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన సినిమాలు తీసే విధానంపై ఆడియెన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే..
ఫహద్ ఫాసిల్ మాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ అద్భుతమైన పాత్రల్లో అలరిస్తున్నాడు. రీసెంట్గా రిలీజైన రజినీ 'వేట్టయన్' సినిమాలో బ్యాటరీ రోల్లో దొంగ నుండి పోలీస్ ఇన్ఫార్మర్గా మారిపోయే పాత్రలో అదరగొట్టాడు. కామెడీతో పాటు ఎమోషన్స్ తో ఆకట్టుకున్నాడు. పుష్ప సినిమాలో షెకావత్ సార్‌గా తెలుగు వాళ్ళకి కూడా పరిచయమయ్యారు. అయితే మాలీవుడ్‌లో ఒక స్టార్ హీరోగా కొనసాగుతూ.. ఇతర భాషల్లో ఇలాంటి సైడ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం ఎందుకని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
అయితే బిగ్ స్టార్స్ ఇతర భాషల్లో సినిమాలు తీయడం కొత్తేమి కాదు. గతంలోనూ మోహన్ లాల్, విష్ణువర్ధన్, దేవరాజ్, నెపోలియన్ లాంటి స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించారు. ఎందుకంటే.. మాలీవుడ్ ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే చాలా చిన్నది. రెమ్యూనరేషన్స్ కూడా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా సంపన్నమైనది. మాలీవుడ్‌లో స్టార్ హీరోగా చేసిన రాని రెమ్యూనరేషన్ తెలుగు సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసిన వస్తుంది. ఫహద్ పుష్ప సినిమాకి 7 కోట్ల వరకు ఛార్జ్ చేశాడని టాక్. అదే మలయాళంలో లీడ్ రోల్ చేసిన అంతా ఇచ్చుకోలేరు. మరోవైపు పాన్ ఇండియా సినిమాలతో లాంగ్వేజ్ బేరియర్స్ చెరిగిపోవడంతో డైరెక్టర్లు కూడా స్టార్ వాల్యూ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్‌ని ప్రిఫర్ చేస్తున్నారు.