‘గద్దర్ అవార్డ్స్ పై కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Aug 01 , 2024 | 04:15 AM
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫిల్మ్ అవార్డ్స్ ను ఇకపై ‘గద్దర్’ అవార్డ్స్ పేరుతో ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడంపై తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది...
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫిల్మ్ అవార్డ్స్ ను ఇకపై ‘గద్దర్’ అవార్డ్స్ పేరుతో ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడంపై తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ‘నటుడిగా, గాయకుడిగా ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి గద్దర్. ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వాలనుకోవడం సముచిత నిర్ణయం. ఈ అవార్డుల విఽధివిధానాలు ఎలా ఉండాలో తయారు చేయడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి ఓ కమిటీని నియమిస్తాయి. ఆ విధి విధానాలను ఎఫ్.డి.సి. ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారికి త్వరలో అందజేస్తాం’ అని తెలుగు చిత్ర పరిశ్రమ ఒక ప్రకటనలో తెలిపింది.