BSS12: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సమీరగా సంయుక్త..

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:16 PM

యాక్షన్-హల్క్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఇప్పుడాయన చేస్తోన్న BSS12 చిత్రాన్ని ఆయన కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయేలా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.., మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ సంయుక్త లుక్‌ని మేకర్స్ రివీల్ చేశారు.

Samyuktha in BSS12

యాక్షన్-హల్క్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఇప్పుడాయన చేస్తోన్న BSS12 చిత్రాన్ని ఆయన కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయేలా చిత్రీకరిస్తున్నారు. హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక విలువలతో మ్యాసీవ్ స్కేల్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.., మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీ. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ ఎలాంటి స్పందనను రాబట్టుకుందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంయుక్త లుక్‌ని.. ఆమె బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Devara Trailer: దేవర.. మరో ఆచార్య! నెట్టింట రచ్చ ర‌చ్చ‌


400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో ఒకల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుస సక్సెస్‌లతో ఉన్న సంయుక్త ఫీమేల్ లీడ్‌లో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇక ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ సంయుక్త పాత్రను సమీరాగా (Samyuktha As Sameera) పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గ్లాస్ షెల్ఫ్‌లపై రకరకాల నిర్మాణాలు కనిపిస్తుండగా, ఇంటెన్స్ లుక్స్‌తో కూడిన మోడరన్ అమ్మాయి లుక్‌లో సంయుక్త వావ్ అనేలా ఉంది. అలాగే ఈ సినిమా కాన్సెప్ట్‌కు చాలా దగ్గరగా ఈ పోస్టర్‌ని డిజైన్ చేయడం విశేషం. (HBDSamyuktha)


Samyuktha-BSS12.jpg

BSS12 చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి అత్యుత్తమ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. శివేంద్ర కెమెరామ్యాన్‌గా, లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఉంటాయని మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Sep 11 , 2024 | 04:16 PM