Tollywood Box Office: వెలవెలపోతున్న థియేటర్స్, ప్రేక్షకుల అనాసక్తి

ABN , Publish Date - Apr 12 , 2024 | 01:58 PM

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన 'టిల్లు స్క్వేర్' విజయవంతం అయ్యాక, విడుదలైన తెలుగు సినిమాలు ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రభావం చూపించలేకపోయాయి. గత వారం, ఈ వారం మలయాళం అనువాదం సినిమా తప్ప మిగతా సినిమాలు ఎటువంటి బజ్ ని క్రియేట్ చేయలేకపోయాయి అని అనలిస్ట్స్ అంటున్నారు

Tollywood Box Office: వెలవెలపోతున్న థియేటర్స్, ప్రేక్షకుల అనాసక్తి
Complete dull time at Tollywood Box Office

ప్రతి శుక్రవారం టాలీవుడ్ లో చిన్న, పెద్ద సినిమాలు ఏవో ఒకటి విడుదలవుతూ ఉంటాయి. గత వారం విజయ్ దేవరకొండ నటించిన 'ఫామిలీ స్టార్' విడుదలైంది, అలాగే మలయాళంలో విజయవంతమైన సినిమా 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగులో అనువాదం చేసి విడుదల చేశారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకుడు, దిల్ రాజు నిర్మాత. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా విజయం సాధించలేదు అనే చెప్పాలి.

TheFamilystarstill.jpg

ఈ సినిమాకి ఎందుకో అంతగా ఓపెనింగ్స్ రాలేదు, అలాగే విమర్శకుల నుండి కూడా ఈ సినిమాకి ప్రసంశలు రాలేదు. ఈ సినిమా విడుదలకి ముందు చిత్ర నిర్వాహకులు ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ అని ప్రచారం చేశారు. కానీ సినిమాలో ఆ మధ్యతరగతి కుటుంబ కష్టాలు ఎక్కడా కనిపించలేదని, అదీ కాకుండా రెండో సగం పూర్తిగా భిన్నంగా ఉందని చెపుతున్నారు. ఏమైనా ఎంతో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడింది. విజయ్ దేవరకొండకి ఇది ఒక ఫ్లాపు, అలాగే మృణాల్ ఠాకూర్ కి టాలీవుడ్ లో మొదటి ఫ్లాపు నమోదు చేసుకున్నారు అని అనలిస్ట్స్ చెపుతున్నారు.

Mahesh Babu: యూరప్‌ ట్రిప్‌ ఫొటోలు వైరల్‌.. అందులో ఏముందంటే!

anupamatillusquare.jpg

ఇక మలయాళం సినిమా 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగులో బాగానే నడిచింది అని చెప్పొచ్చు. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు కొంచెం ఆసక్తిగానే చూసారు అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా మలయాళంలో ఎక్కువ డబ్బులు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. మామూలుగానే మలయాళం సినిమాలు అంటే ఈమధ్య తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు, అందుకని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే నడిచింది అని అంటున్నారు.

geethanjaliworkingstill.jpg

ఇక నిన్న గురువారం రంజాన్ సెలవు దినం కావటంతో మూడు సినిమాలు 'గీతాంజలి మళ్ళీ వచ్చింది', 'లవ్ గురు', 'శ్రీరంగ నీతులు', విడుదలయ్యాయి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క సినిమా కూడా ప్రభావం చూపించలేకపోయాయి అని అంటున్నారు. అంజలి నటించిన 50వ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది', కోన వెంకట్ రచన, నిర్మాత కూడాను. అయితే ఈ సినిమాకి అసలు ఎక్కడా బజ్ కనిపించలేదు, వినిపించలేదు అని అనలిస్ట్స్ అంటున్నారు.

lovegurustill.jpg

అందుకనే ఈ సినిమాకి కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదని, ఇది కూడా కొన్ని రోజుల సినిమాగా చెపుతున్నారు. ఇక విజయ్ ఆంటోనీ నటించిన డబ్బింగ్ సినిమా 'లవ్ గురు' సినిమాకి కూడా ఓపెనింగ్స్ అస్సలు లేకుండా పోయాయని అంటున్నారు. ఈ సినిమాకి కూడా బజ్ లేదని అంటున్నారు. ఇంకో చిన్న సినిమా 'శ్రీరంగ నీతులు' విడుదలైంది, సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వుంది, కానీ ప్రేక్షకులు మాత్రం కరువయ్యారు అని తెలుస్తోంది.

Dear-Movie.jpg

అలాగే ఈరోజు ఇంకో డబ్బింగ్ సినిమా 'డియర్' విడుదలైంది. ఇందులో ఐశ్వర్య రాజేష్, జీవీ ప్రకాష్ కుమార్ జంటగా నటించారు, కానీ ఈ సినిమా విడుదలైనట్టుగానే ఎవరికీ తెలియదు అని అంటున్నారు. ఈ సినిమా కూడా ఇంకో డబ్బింగ్ సినిమా విడుదలైంది, వెళ్ళిపోయింది అనేట్టుగా వుంది అని చెపుతున్నారు. రెండు వారాల క్రితం విడుదలైన 'టిల్లు స్క్వేర్' ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా ఇప్పటికే రూ. వందకోట్లకి పైగా కలెక్టు చేసి, నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

Updated Date - Apr 12 , 2024 | 01:58 PM