డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:12 AM
తెలుగు ఫిల్మ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో ప్రకాశ్ భారీ మెజార్టీతో విజయం...
తెలుగు ఫిల్మ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో ప్రకాశ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అధ్యక్షుడిగా ప్రకాశ్ ఎన్నికవడం ఇది ఐదోసారి. కాగా, జానీని అధ్యక్షుడిగా తొలగించడంతో పాటు ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జానీపై పోక్సో కేసు విచారణలో ఉండటం, అసోసియేషన్‌లో జానీ ప్రవర్తన అగ్రెసివ్‌గా ఉండేదనే రిపోర్టు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.