Spirit: హహ.. సందీప్ సినిమానా 'నో' ఛాన్స్.. బాంబ్ పేల్చిన హీరోయిన్

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:18 PM

సందీప్ ‘స్పిరిట్’ సినిమా కోసం ఇప్పటికే క్రేజి స్టార్ల కామియోతో పాటు ఒక బాలీవుడ్ స్టార్ కపుల్స్‌ని స్ట్రాంగ్ విలన్ రోల్స్ చూపెట్టనున్నారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై ఓ హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సందీప్ సినిమానా నో ఛాన్స్ అన్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే..

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas)తో భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న సినిమా ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఇప్పటికే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సందీప్ ఇప్పటికే క్రేజి స్టార్ల కామియోతో పాటు ఒక బాలీవుడ్ స్టార్ కపుల్స్‌ని స్ట్రాంగ్ విలన్ రోల్స్ చూపెట్టనున్నారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై ఓ హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సందీప్ సినిమానా నో ఛాన్స్ అన్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే..


kareena.jpgవయసుతో సంబంధం లేకుండా నేటితరంతో పోటీ పడుతూ సూపర్ హిట్ సినిమాలు తీస్తున్న లెజెండరీ యాక్ట్రెస్ కరీనా కపూర్. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునేషన్ తీసుకొనే హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతూనే.. మంచి సందేశాత్మక చిత్రాలతో సమాజంపై ప్రభావం చూపే మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే గతకొంత కాలం నుండి సందీప్ 'స్పిరిట్' సినిమాలో సైఫ్ అలీ ఖాన్ తో పాటు తన వైఫ్ కరీనాని విలన్ రోల్ కోసం మూవీ మేకర్స్ కాంటాక్ట్ అయినట్లు దానికి వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి కరీనా సమాధానం చెబుతూ.. అవి జస్ట్ రూమర్స్ అని కొట్టిపడేసింది. తమదైన విలక్షణ నటనతో బాలీవుడ్‌ని దశాబ్దాల నుండి ఏలుతున్న ఈ కపుల్.. సినిమాలో చేయడం లేదని క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.


మరోవైపు సందీప్ రెడ్డి సినిమాలో కామియో రోల్స్ అయిన జస్ట్ మార్కెట్ కోసం పెట్టాడు. ఆ రోల్స్ ఒక ఇంప్యాక్ట్ సృష్టించే విధంగా ఉంటాయి. అలాంటిది ప్రభాస్ తొలిసారి పోలీస్‌గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు క్రేజి స్టార్స్‌ను బరిలోకి దింపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌లో ఫస్ట్ సినిమాతోనే విజయ్ దేవరకొండని స్టార్ హీరోగా మలిచాడు వంగా. ఇక కబీర్ సింగ్‌తో హిందీ ఆడియెన్స్‌కి వైలెన్స్ సరిగ్గా అర్థం కాలేదని 'యానిమల్'తో రణ్‌బీర్ కపూర్‌ని మోస్ట్ వైలెంట్‌గా చూపించాడు. అయితే ఈ ఇద్దరినీ ప్రభాస్ 'స్పిరిట్' కోసం రంగంలోకి దించనున్నాడట సందీప్. ఈ కాంబో కానీ రిపీట్ అయితే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. విజయ్ దేవరకొండకి కొన్ని ప్లాప్స్ తర్వాత తెలుగులో కాస్త క్రేజ్ తగ్గినట్లు కనిపిస్తున్న.. హిందీలో మాత్రం కొంచం కూడా తగ్గలేదు. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్‌ని సందీప్ ఎలా చూపెట్టబోతున్నాడని ఫ్యాన్స్‌తో సహా సినీ సర్కిల్స్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

Updated Date - Oct 20 , 2024 | 12:30 PM