Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాకి వెరైటీ టైటిల్ 'క'

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:14 PM

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఆసక్తికరంగా 'క' అని పెట్టారు. ఈ సినిమాకి దర్శక ద్వయం సుజీత్, సందీప్. ఇదొక పీరియడ్ డ్రామాగా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయిందని, త్వరలోనే ఈ సినిమా గురించి మరింత సమాచారం చెపుతారని తెలుస్తోంది.

Kiran Abbavaram and his new film title Ka

యువ నటుడు కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన కథలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఈ కోవలోనే ఇప్పుడు కిరణ్ ఒక భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి ఒక వెరైటీ టైటిల్ ని కూడా పెట్టాడు. ఇంతకీ ఆ సినిమా టైటిల్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సినిమాకు 'క' అనే ఆసక్తికరమైన టైటిల్ ఈరోజు ప్రకటించారు. టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం మేకోవర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. (Kiran Abbavaram new film titled as Ka)

kiranabbavaramnewfilmkha.jpg

ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఇద్దరు చేస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సినిమా కథ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. అంతే కాకుండా ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ కథగా కూడా రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయ్యింది అని చెపుతున్నారు. (Ka is the title for Kiran Abbavaram upcoming film)

ప్రస్తుతం ఈ 'క' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెపుతున్నారు. త్వరలో 'క' సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. కొంత విరామం తీసుకొని కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ 'క' సినిమా ప్రకటన ఆసక్తికాని రేపుతోంది.

Updated Date - Jul 10 , 2024 | 12:16 PM