Telugu Film Industry: ఎఫ్.డి.సి. చైర్మన్ పదవికై పావులు కదుపుతున్న కెఎస్ రామారావు

ABN , Publish Date - Jul 10 , 2024 | 11:26 AM

ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు నిన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి, చలన చిత్ర అభివృద్ధికై పలు అంశాలు చర్చినట్టుగా తెలిసింది. అయితే ఈ కలయిక వెనక రామారావు ఎఫ్.డి.సి చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టుగా చూచాయగా తెలుస్తోంది. ఈ కీలక పదవికోసం అతను పావులు కదుపుతున్నట్టుగా పరిశ్రమలో చర్చ నడుస్తోంది

Producer K S Rama Rao met AP Chief Minister N Chandrababu Naidu on Tuesday

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్, అటవీశాఖతో పాటుగా మరికొన్ని శాఖలకు మంత్రిగా నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టారు. కొత్త ప్రభుత్వంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ మంచి సత్సంబంధాలు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు విజయవాడ వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసిన వారిలో వున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపి ఎఫ్.డి.సి) చైర్మన్ పదవి కూడా ఇప్పుడు ఎంతో కీలకమని చెప్పాలి. (KS Rama Rao is eyeing for AP Film Development Corporation Chairman post)

ఇంతకు ముందు ఆ పోస్టులో వున్నవాళ్లు తెలుగు పరిశ్రమకి చేసిందేమీ లేదనే చర్చ ఒకటి నడిచింది. ఇప్పుడు ఈ ఎఫ్.డి.సి చైర్మన్ పదవి ఎవరికీ వరిస్తుందో అనే విషయంపై పరిశ్రమలో తాజాగా చర్చ నడుస్తోంది. కొందరేమో ఘట్టమనేని ఆదిశేషగిరి రావు కి ఇవ్వొచ్చు అని అంటున్నారు, అతనైతే పరిశ్రమలో అజాత శత్రువు లాంటి వ్యక్తి, పరిశ్రమ బాగోగులు గురించి బాగా తెలిసిన వ్యక్తి, అందుకని అతనికి ఈ పదవి చంద్రబాబు నాయుడు ఇవ్వొచ్చు అని అంటున్నారు. (Producer KS Rama Rao is trying all his efforts to get the FDC Chairman Post)

ksramaraochiranjeevi.jpg

ఇంకొక పక్క ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు ఈ చైర్మన్ పదవికై పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. రామారావు, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అవటం కూడా ఒక కారణం అని అంటున్నారు. ఈమధ్యనే విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి సినిమా రంగం గురించి పలు అంశాలు చర్చించారు అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెపుతున్నా, దీని వెనక వున్న ఉద్దేశ్యం మాత్రం రామారావు ఎఫ్.డి.సి చైర్మన్ పదవికోసమే అని తెలుస్తోంది. (Producer G Adiseshagiri Rao's name is also on the list for the FDC Chairman)

అలాగే కొన్ని రోజుల క్రితం రామారావు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని కూడా కలిశారు. ఇది కూడా కేవలం మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెపుతున్నా, దీని వెనకాల మాత్రం ఎఫ్.డి.సి చైర్మన్ కోసమే అన్నట్టుగా తెలుస్తోంది. రామారావు తనవంతుగా అందరినీ కలుస్తూ, చైర్మన్ పదవి కోసమై తన పేరును ప్రతిపాదించేట్టుగా చెయ్యడానికి పావులు కదుపుతున్నట్టుగా పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వున్న ఈ తరుణంలో ఈ ఎఫ్.డి.సి చైర్మన్ పదవి ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు. అటు ప్రభుత్వానికి, ఇటు చిత్ర పరిశ్రమకి మధ్య వారధిలా వుండి సమన్వయంతో వ్యవహరించే వ్యక్తికి ఈ కీలక పదవి ఇవ్వనున్నారు.

Updated Date - Jul 10 , 2024 | 11:26 AM