M4M: హాలీవుడ్ రేంజ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ చూసేందుకు సిద్ధమా..

ABN , Publish Date - Nov 06 , 2024 | 07:52 PM

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై మునుపెన్న‌డూ చూడ‌ని థ్రిల్లింగ్ స‌బ్జెక్టుతో వస్తున్నామంటున్నారు M4M (Motive For Murder) చిత్ర బృందం. తెలుగుతో పాటు ఐదు భాషలలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల ఉంటుందని తెలుపుతూ.. మేకర్స్ ఓ న్యూ పోస్టర్‌ని విడుదల చేశారు.

M4M Movie Still

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై మునుపెన్న‌డూ చూడ‌ని థ్రిల్లింగ్ స‌బ్జెక్టుతో వస్తున్నామంటున్నారు M4M (Motive For Murder) చిత్ర బృందం. తెలుగుతో పాటు ఐదు భాషలలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా చిత్ర‌యూనిట్ చిత్రానికి సంబంధించిన ఓ న్యూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫ‌రెంట్‌గా.. నా రూటే వేరు అన్నట్లు ఉంది. ఆ పోస్టర్ డిజైన్, M4M టైటిల్ చూస్తుంటే ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అనే ఫీల్ ఇస్తోంది.

Also Read-Celebrity Couple: కోర్టు మెట్లెక్కిన మరో సెలబ్రిటీ కపుల్.. ఎవరంటే


M4M-Movie.jpg

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ప్రిన్సిపల్‌తో M4M (Motive For Murder) మూవీని తెర‌కెక్కించాం. స‌రికొత్త‌ సస్పెన్స్ థ్రిల్లర్ స‌బ్జెక్టుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీలో ఏ ఫెదర్ ఇన్ క్రౌన్ అవుతుందనే నమ్మకం ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ జోనర్‌లో ఇదొక కలికితురాయిగా నిలుస్తుంది. త్వ‌ర‌లోనే M4M ను ఐదు భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయ‌బోతున్నాం. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాం. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ ప‌వ‌న్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా ప‌నితనం.. వంటి మా టీమ్ వ‌ర్క్‌ ప్రేక్షకులకు హాలీవుడ్ రేంజ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని అన్నారు. కాగా, మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్‌విన్ గ్రూప్ USA సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జో శర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రలలో నటించారు.

Also Read-Suriya - NBK: సింగం, సమరసింహం ఒకే స్టేజ్‌పై.. ‘ఐ లవ్ యు’

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 06 , 2024 | 07:52 PM