మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు

ABN , Publish Date - May 08 , 2024 | 01:39 PM

ముఖ్యమంత్రిగా నటించిన నటుల్లో మహేష్ బాబు ఒకరు. కొరటాల శివ దర్శకత్వం వహించిన 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో కొన్ని సమస్యలకి చూపించే పరిష్కారాలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ఇందులో అవినీతి లేని సమాజాన్ని ఎలా చెయ్యాలో కూడా చూపించే ప్రయత్నం చేస్తారు.

మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు
Mahesh Babu played as Chief Minister in Bharath Ane Nenu

సినిమా: భరత్ అనే నేను

నటీనటులు: మహేష్ బాబు, కియారా అద్వానీ, ప్రకాష్ రాజ్, రావు రమేష్

దర్శకత్వం: కొరటాల శివ

విడుదల: ఏప్రిల్ 20, 2018

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన సినిమా 'భరత్ అనే నేను'. కొరటాల దర్శకత్వంలో వచ్చిన, ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా చాల బాగా చేశారు అని ప్రసంశలు అందుకున్నారు. కొరటాల రచనతో ఈ సినిమాలో కొన్ని సమస్యలకు పరిష్కారాలు చూపించే దిశగా చేసి, వాటిని ఆలోచింపచేసే విధంగా ఈ సినిమాని తీశారు. ముఖ్యంగా విద్య పేదవారికి ఎలా అందాలి, ట్రాఫిక్ నియంత్రణ లాంటి సమస్యలకి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అనేది బాగా చెప్పారు. (Mahesh Babu played as Chief Minister in Bharath Ane Nenu film directed by Koratala Siva)

bharathanenenustill.jpg

ఇంకా సినిమా నేపధ్యానికి వస్తే తన తండ్రి ముఖ్యమంత్రిగా చేసి చనిపోతే, ఆక్స్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న భరత్ రామ్ ని ఇండియా పిలిపించి ముఖ్యమంత్రిని చేస్తాడు తన తండ్రికి గురువైన వరద. మెరుగైన సమాజం, అవినీతి రహిత రాష్ట్రం చెయ్యడం కోసం ముఖ్యమంత్రిగా భరత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రజలు అతని నిర్ణయాలను గౌరవిస్తారు, మద్దతిస్తారు. కానీ అవి కొన్ని రాజకీయ పార్టీలకి నచ్చవు, అందుకు ప్రతిపక్షం, మిత్రపక్షంలోని కొంతమంది ఎం.ఎల్.ఏ లతో భరత్ ని ముఖ్యమంత్రి పదవి నుండి ఊడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ పోరాటంలో అతను ఏమి చేసాడు, ఎటువంటి సంఘటనలను ఎదుర్కొన్నాడు అనేది 'భరత్ అనే నేను' సినిమా. చివరికి అతని ప్రజలకి చేసిన వాగ్దానాలను ఎలా అమలు పర్చ గలిగాడు అనేది కూడా చూపిస్తారు.

ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో ఒక విజయవంతమైన సినిమాగా చెప్పొచ్చు. దర్శకుడు కొరటాల శివ, మంచి రచయిత కూడా, ఈ సినిమాలో తన పదినైన మాటలతో తన రచనా బలాన్ని చూపించాడు. ఇందులో చాలా మాటలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి.

Updated Date - May 08 , 2024 | 01:39 PM