మంచి సినిమా నిర్మించా
ABN , Publish Date - Oct 30 , 2024 | 05:44 AM
హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు. సుజీత్, సందీప్ దర్శకులు. నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి. ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా....
హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు. సుజీత్, సందీప్ దర్శకులు. నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి. ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి మీడియాతో ముచ్చటించారు.‘నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా సినిమాల మీద ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. లాక్‌డౌన్ టైమ్‌లో ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను. ‘క’ సినిమా కథ విన్నప్పుడు కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇందులో సస్పెన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్ర్కిప్ట్ బాగా నెరేట్ చేశారు. కథను ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా తెరకెక్కించారు. ఔట్‌పుట్ చూసి ఇంప్రెస్ అయ్యాను.
ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేసుకోవచ్చు. కిరణ్ అబ్బవరం కష్టపడే తత్వం ఉన్న హీరో. చాలా మంచివాడు. ‘క’ సినిమాకు ఎంతో శ్రమించి వర్క్ చేశాడు. హైదరాబాద్‌లో చాలా మంచి థియేటర్స్ దొరికాయి. మొత్తంగా 350కి పైగా థేయేటర్లలో ‘క’ రిలీజ్ అవుతోంది’ అని తెలిపారు.