Naa Saami Ranga: అంజిగాడి ‘మంగ’ లుక్ వచ్చేసింది..

ABN , Publish Date - Jan 04 , 2024 | 08:32 PM

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి పర్ఫెక్ట్ ఛాయిస్ అనే కంటెంట్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘నా సామిరంగ’లో అంజిగా చేస్తున్న అల్లరి నరేష్ భాగస్వామి అయిన మిర్నా మీనన్ లుక్‌ని విడుదల చేశారు. మంగ పాత్రలో ఆమె ఇందులో నటిస్తోంది.

Naa Saami Ranga: అంజిగాడి ‘మంగ’ లుక్ వచ్చేసింది..
Mirna Menon in Naa Saami Ranga

కింగ్ నాగార్జున అక్కినేని (King Akkineni Nagarjuna) హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి పర్ఫెక్ట్ ఛాయిస్ అనే కంటెంట్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘నా సామిరంగ’లో అంజిగా చేస్తున్న అల్లరి నరేష్ (Allari Naresh) భాగస్వామిని రివీల్ చేశారు. అంజి భాగస్వామి మంగ (Manga) పాత్రలో చేసిన మిర్నా మీనన్‌ (Mirna Menon)ను ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మిర్నా మీనన్ సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టులో అందంగా కనిపిస్తోంది.


Menon.jpg

మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్‌గా వుండటంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మేకర్స్ ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ (Srinivasaa Silver Screen)పై శ్రీనివాస చిట్టూరి (Srinivasa Chitturi) హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తున్న ఈ ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. ఈ సినిమాని జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?

******************************

*దీనస్థితిలో ఉన్న న‌టి పావ‌ల శ్యామ‌ల‌కు ‘మనం సైతం’ సాయం

**************************

*Tripti Dimri: ఈ నయా నేషనల్ క్రష్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

************************

*Sailesh Kolanu: ధైర్యంగా ట్రైలర్‌లోనే కథ చెప్పా.. ఇక మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా!

*******************************

Updated Date - Jan 04 , 2024 | 08:32 PM