Viswam: గోపీచంద్ ‘విశ్వం’ నుంచి హార్ట్ టచ్చింగ్ సాంగ్ విడుదల

ABN , Publish Date - Sep 24 , 2024 | 09:56 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ‘మొరాకో మగువా’ పాట మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట వివరాలివే..

Viswam Movie Still

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’ (Viswam). ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన రిలీజైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ని విడుదల చేశారు.

Also Read-Pawan Kalyan: హీరో కార్తీ క్షమాపణలపై పవన్ కళ్యాణ్ స్పందనిదే..


ఇంతకు ముందు విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘మొరాకో మగువా’కు ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని మ్యూజికల్ ప్రమోషన్స్‌కు మంచి ఊపిచ్చింది. మంగళవారం మేకర్స్ సెకండ్ సింగిల్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ (Mondithalli Pilla Nuvvu) సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసి హార్ట్ టచ్చింగ్ నంబర్‌గా కంపోజ్ చేశారు.


viswam.jpg

‘‘అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి!

కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి!

మొండి తల్లి పిల్ల నువ్వు’’ అంటూ సాగిన ఈ పాటకు శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా ఉండగా.. అదే స్థాయిలో సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్‌తో కట్టిపడేశారు. మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్‌ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపీచంద్‌కు వున్న బాండింగ్‌ని రివీల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచేలా ఉంది. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. గోపీచంద్ సరసన కావ్యథాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2024 | 09:56 PM