Viswam: ‘విశ్వం’.. మొరాకో మగువా వచ్చేసింది

ABN , Publish Date - Sep 11 , 2024 | 10:02 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘మొరాకో మగువా’ అనే సాంగ్ వదిలారు.

Viswam Movie Still

మాచో స్టార్ గోపీచంద్ (Macho Star Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’ (Viswam). రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మొరాకో మగువా’ (Moroccan Maguva Song) అనే సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Tammareddy Bharadwaja: తప్పు చేశానని ప్రూవ్ చేస్తే దేనికైనా రెడీ..

ఎలక్ట్రిఫైయింగ్, గ్రూవీ నంబర్ అయిన ఈ ‘మొరాకో మగువా’ సాంగ్‌తో మేకర్స్ మ్యూజికల్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ డైనమిక్ సాంగ్‌కు పృధ్వీ చంద్ర, సాహితీ చాగంటి ఎనర్జిట్ వోకల్స్ అందించారు. లైవ్లీ టెంపో, షిఫ్టింగ్ రిధమ్స్‌తో వచ్చిన ఈ సాంగ్ వినగానే ఎక్కేస్తుంది. రాకేందు మౌళి లిరిక్స్ తెలుగు, ఇంగ్లీష్‌ని అద్భుతంగా బ్లెండ్ చేసింది. గోపీచంద్, కావ్య థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీ, ఎలిగెన్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు. ఎక్సోటిక్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ వావ్ అనేలా ఉన్నాయి. ‘మొరాకో మగువా’ సాంగ్ మ్యూజిక్ ప్రమోషన్స్‌కు చార్ట్ బస్టర్ స్టార్ట్ ఇచ్చింది. (Viswam Movie)


Gopichand-Viswam.jpg

ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె వర్క్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read-Malaika Arora Father: ఆత్మహత్య చేసుకున్న మలైకా తండ్రి అనిల్ అరోరా..

Read Latest Cinema News

Updated Date - Sep 11 , 2024 | 10:02 PM