Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ సితార్ సాంగ్.. భాగ్యశ్రీ బోర్స్ అసలేముందిలే..!

ABN , Publish Date - Jul 10 , 2024 | 05:28 PM

డైరెక్టర్ హరీష్ శంకర్ మ్యూజికల్ టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవుతాయి. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో ఆయన చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ కూడా డిఫరెంట్ జానర్‌లతో కూడిన ఆల్బమ్‌‌ని రెడీ చేస్తున్నారు. ‘సితార్’ అంటూ చిన్న ప్రోమోతో ఆదరగొట్టిన తర్వాత, బుధవారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ సితార్ లిరికల్‌ వీడియోని రిలీజ్ చేశారు.

Mr Bachchan Movie Stills

డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) మ్యూజికల్ టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవుతాయి. గత ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja)తో ఆయన చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) కూడా డిఫరెంట్ జానర్‌లతో కూడిన ఆల్బమ్‌‌ని రెడీ చేస్తున్నారు. ‘సితార్’ అంటూ చిన్న ప్రోమోతో ఆదరగొట్టిన తర్వాత, బుధవారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ సితార్ లిరికల్‌ వీడియోని రిలీజ్ చేశారు.

Mr-Bachchan-2.jpg

‘సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్’ తర్వాత మిక్కీ జె మేయర్ మళ్లీ హరీష్ శంకర్‌తో ఈ సినిమా కోసం జతకట్టారు. ఈ పాట సితార్ సౌండ్స్‌తో ప్రారంభమై.. మ్యాజిక్ బీట్‌లతో కూడిన కంప్లీట్ క్లాసికల్ నెంబర్‌గా ఆకర్షిస్తోంది. ‘కెవ్వు కేక, అస్మైక యోగ’ అనే రెండు చార్ట్‌బస్టర్‌ల తర్వాత హరీష్ శంకర్, లిరిక్ రైటర్ సాహితీ రీయూనిట్‌లో వచ్చిన ఈ పాట కూడా మెస్మరైజింగ్ లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది. ట్రాక్‌కి అందించిన పదాలు జెమ్స్, సాకేత్ కొమండూరి, సమీర భరద్వాజ్ వోకల్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి. అలాగే, చారులత మణి క్లాసిక్ రాగం ట్రూలీ క్లాసికల్. బ్యాక్ పాకెట్, హిప్ మూవ్‌లు వీడియో సాంగ్ కోసం వెయిట్ చేసేలా చేస్తున్నాయి. (Mr Bachchan First Single Sitar)


Mr-Bachchan.jpg

రవితేజ స్టైలిష్ ఎటైర్‌లో యంగ్ అండ్ డాషింగ్‌గా కనిపిస్తే.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse) అబ్బ.. ఏముందిలే అనేలా గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. రవితేజ, భాగ్యశ్రీల కెమిస్ట్రీ చూడచక్కగా ఉంది. రవితేజ డ్యాన్స్ మూమెంట్స్ ఎక్స్‌లెంట్‌గా వుండగా భాగ్యశ్రీ తన ఎలిగెంట్ మూమెంట్స్‌తో మెస్మరైజ్ చేసింది. శేఖర్ మాస్టర్ తన కొరియోగ్రఫీతో విజువల్స్‌కి మరింత ఎలిగెన్స్ తీసుకొచ్చారు. అయాంకా బోస్ విజువల్స్ చాలా ఎనర్జిటిక్ అండ్ బ్యూటీఫుల్‌గా వున్నాయి. కాశ్మీర్ లోయలోని ఎక్సోటిక్ లొకేషన్లను చాలా ఆకర్షణీయంగా చూపించారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 10 , 2024 | 05:28 PM

Mr Bachachan: ఓవర్‌ చేయకురోయ్‌.. నీ దిష్టే తగిలేలా  ఉంది!

Mr Bachchan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్‌’లో జగ్గు భాయ్ అవతార్ చూశారా..

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ మూవీలోని సితార్ లిరికల్ సాంగ్

Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ.. ఇంకోటి మొదలెట్టారు..

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ మాస్ అండ్ యాక్షన్-ప్యాక్డ్ షోరీల్ వీడియో