SDT18: ఒకటి కాదు.. రెండు అప్డేట్స్
ABN , Publish Date - Oct 27 , 2024 | 06:56 PM
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. రోహిత్ కెపి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి సంబంధించి తాజాగా రెండు అప్డేట్స్‌ని మేకర్స్ వదిలారు. అవేంటంటే..
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. రోహిత్ కెపి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రెండు అప్డేట్స్‌ని మేకర్స్ వదిలారు.
Also Read-Renu Desai: ఉపాసనకు థ్యాంక్స్ చెప్పిన రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ‘ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ’ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ టీమ్ డెడికేషన్‌ని ఈ వీడియో ప్రజెంట్ చేసింది. ఆర్కాడీ వరల్డ్ లోకి ఈ స్నీక్ పీక్ చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది. ఇక మేకర్స్ లేటెస్ట్‌గా ఇచ్చిన క్రేజీ అప్డేట్స్ ఏమిటంటే.. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ బి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమా కోసం మాస్ ఫీస్ట్ ఆల్బమ్‌ని కంపోజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
ఇక రెండో అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాకు ఎడిటర్‌గా సాయి దుర్గతేజ్ స్నేహితుడు నవీన్ విజయ్ కృష్ణ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడమే కాకుండా.. సాయి దుర్గతేజ్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. నవీన్ విజయ్ కృష్ణ ఇటీవల సాయి దుర్గేతేజ్, స్వాతిలపై ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోకి అవార్డుల పంట పండింది. సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.