Controversy: నీ మైండ్ దొబ్బిందా అంటూ ప్రియదర్శిపై నభా నటేష్ ఫైర్, దానికి ప్రియదర్శి రిప్లయ్ ఏంటంటే

ABN , Publish Date - Apr 19 , 2024 | 03:18 PM

నటీనటులు నభ నటేష్, ప్రియదర్శి మధ్య మాటల వాగ్యుద్ధం, వివాదాస్పద వ్యాఖ్యలు, వీరిద్దరికి రీతూ వర్మ ఇచ్చిన సమాధానం చివరికి ఎటు దారితీసింది అంటే...

Controversy: నీ మైండ్ దొబ్బిందా అంటూ ప్రియదర్శిపై నభా నటేష్ ఫైర్, దానికి ప్రియదర్శి రిప్లయ్ ఏంటంటే
Priyadarshi and Nabha Natesh

ప్రభాస్ తన సినిమాల ప్రచారాల విషయంలో తన అభిమానులను ఉద్దేశించి 'డార్లింగ్స్' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తాడు. అయితే ఈమధ్యకాలంలో అతను ఆ పదాన్ని వాడటం మానేసాడు, ఎందుకంటే 'డార్లింగ్' అనే పదాన్ని ప్రజావేదికలపై ఉపయోగించకూడదు అని ఒక వార్త ఆమధ్య హల చల్ చేసింది. అందుకని ఎక్కువగా ఎవరూ ఆ పదంతో అవతలి వ్యక్తులని పిలవటం మానేశారు. అయితే ఇప్పుడు ఇదే పదం ఇద్దరి నటుల మధ్య ఒక తీవ్ర వివాదాన్ని రేపింది.

rituvarmaone.jpg


విషయంలోకి వెళితే, నటి రీతూ వర్మ తన సామాజిక మాధ్యమం అయిన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటో షూట్ చేసిన ప్రత్యక చిత్రాలను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రాలపై చాలామంది వ్యాఖ్యలు చేశారు, అందులో నటుడు ప్రియదర్శి కూడా వ్యాఖ్య చేశాడు. అతనేమన్నాడు అంటే, 'వావ్, రీతూ డార్లింగ్! నేను చాలా మంత్రముగ్ధుడయ్యాను, వ్యాఖ్య చెయ్యడానికి పదాల కోసం వెతుక్కుంటున్నాను' అని రీతూ వర్మ చిత్రంపై వ్యాఖ్య చేశాడు ప్రియదర్శి.

rituvarma.jpg

దీనికి రీతూ వర్మ పెద్దగా ఏమీ స్పందించలేదు కానీ, ఇంకొక నటి నభా నటేష్ మాత్రం ప్రియదర్శి వ్యాఖ్యపై ఫైర్ అయింది. "ఇతను మళ్ళీ మొదలెట్టేశాడు, నీకు అమ్మాయిల కామెంట్ సెక్షన్ లో పనేంటి, అలాగే డార్లింగ్ అని పిలవటం ఏంటి? నీకేమైనా మైండ్ దొబ్బిందా? (Are you out of your mind?)" అని నభా నటేష్ ప్రియదర్శిపై ఫైర్ అయింది. దీనికి వెంటనే ప్రియదర్శి ఏమీ ఊరుకోలేదు, "నేను ఎవరినో 'డార్లింగ్' అని పిలిస్తే మధ్యలో నీకెందుకు బాధ? వై దిస్ కొలావరి మేడం" అంటూ సమాధానం చెప్పాడు.

Nabha Natesh  (7).jpg

అయితే ఈ వ్యాఖ్యలు, వాదనలు, సమాధానాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే, నటి రీతూ వర్మ కామెంట్ సెక్షన్ లో కదా. అందుకని ఆమె కూడా ఊరుకోలేదు. "ఏంటి మీ పంచాయితీ నా కామెంట్ సెక్షన్ లో .. " అంటూ ఈ ఇద్దరికీ తగిన సమాధానం చెప్పింది రీతూ వర్మ. ఇప్పుడు ఈ ముగ్గురి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వున్నాయి.

Updated Date - Apr 19 , 2024 | 03:47 PM