Nagababu: మెగా ఫ్యామిలీ సంబరాలు.. నాగబాబు వైరల్‌ కామెంట్స్‌

ABN , Publish Date - Jun 06 , 2024 | 09:06 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి, జనసేన విజయానికి తీవ్రంగా శ్రమించారు పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు. పిఠాపురంలో  పవన్‌  కల్యాణ్‌ విజయానికి అహర్నిశలు కష్టపడ్డారు.

Nagababu: మెగా ఫ్యామిలీ సంబరాలు.. నాగబాబు వైరల్‌ కామెంట్స్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి, జనసేన (Janasena) విజయానికి తీవ్రంగా శ్రమించారు పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు(Nagababu). పిఠాపురంలో  పవన్‌  కల్యాణ్‌ (Pawan kalyan) విజయానికి అహర్నిశలు కష్టపడ్డారు. ప్రస్తుతం నాగబాబు ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

PSPK (2).jpeg

తిరుమల, తిరుపతి దేవస్థా(తితిదే-TTD) ఛైర్మన్‌ పదవిని చేపట్టబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గురువారం ఉదయం నుంచి ఈ వార్త ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషయంపై నాగబాబు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘‘దయచేసి ఫేక్‌ న్యూస్‌ని ఎవరూ నమ్మకండి. పార్టీ అధికారిక, నా సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్‌ అయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయకండి’ అని పేర్కొన్నారు.

PSPK (3).jpeg

గురువారం మధ్యాహ్నాం ఢిల్లీలో ఎన్టీఏ మీటింగ్‌ తర్వాత హైదరాబాద్‌ చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ తన సోదరుడు  చిరంజీవి ఇంటికి విచ్చేశారు. అక్కడ జరిగిన సెలబ్రేషన్స్‌లోనూ మెగా ఫామిలీ అంతా పాల్గొన్నారు. సురేఖ, చిరు చెల్లెలు, మాధవి, విజయ దుర్గ పవన్ కు హారతి ఇచ్చారు. సురేఖ స్వయంగా దిష్టి తీశారు. తదుపరి స్ల మాతృ మూర్తి అంజనా దేవి, అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసారు. చిరంజీవి పవన్ లు పూల మాలతో సత్కరించారు.  సురేఖ పవన్ కళ్యాణ్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. 

PSPK (1).jpeg

ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడారు. "ఎన్నికల్లో కల్యాణ్‌బాబు విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. పోటీ చేసిన అన్ని సీట్లలో గెలవడం రెట్టింపు ఉత్సాహానిచ్చింది. ప్రజలకు సేవ చేయడానికి మంచి అవకాశం దొరికింది. కల్యాణ్‌ ఎమ్మెల్యేనే కాదు అంతకు మించి ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ప్రజలకు సర్వీస్‌ చేయాలనుకుంటున్నాం.

as.jpeg

పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యే అవ్వడంతోపాటు కూటమి విజయానికి, కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఫామ్‌ అవ్వడానికి బిజేపీకి వెన్నెముకలా నిలబడ్డాడు. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. అందుకే కుటుంబ సభ్యులంతా కలిసి గెట్‌ టు గెదర్‌లా చిన్న పార్టీ చేసుకున్నాం. మా ఫ్యామిలీ ఎప్పుడు కలిసినా ఇలాగే ఉంటాం. ఏ పరిస్థితుల్లోనైనా తమ కుటుంబం పవన్‌కు అండగా ఉంటాం. పార్టీకి చేయడం తప్ప పదవులపై నాకు ఎలాంటి ఆశ, ఆలోచన లేదు. జనసేనను ఇంకా ఉన్నత స్థానానికి ఎలా తీసుకెళ్లాలా? అన్న ఆలోచనలోనే ఉంటాను’’ అని నాగబాబు అన్నారు.
Psp.jpg

Updated Date - Jun 07 , 2024 | 07:57 AM